Darshan Son: బూతులు, అసభ్య కామెంట్లకు థాంక్స్.. దర్శన్ కొడుకు ఎమోషనల్
- హత్య కేసులో దర్శన్ అరెస్ట్
- ఎమోషనల్ అవుతూ కొడుకు వినీష్ పోస్ట్
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Darshan Son Vinish Instagram Post On His Father Arrest: రేణుకాస్వామి హత్యకేసులో హీరో దర్శన్ పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ సమయంలో దర్శన్ గురించి శాండిల్ వుడ్ లో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దర్శన్‌కు అభిమానులు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు దర్శన్ తనయుడు వినీష్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఈ ఘటనపై ఇప్పటిదాకా దర్శన్ తల్లి మీనా తూగుదీప, తండ్రి దినకర్ తూగుదీప ఇప్పటిదాకా స్పందించ లేదు. ఈ సమయంలోనే దర్శన్ భార్య విజయలక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తొలగించింది. ఇక వినీష్ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది.“నేను 15 ఏళ్ల అబ్బాయిని. మీరు నా భావాల గురించి ఆలోచించకుండా తప్పుడు కామెంట్లు చేశారు, బూతు పదాలు, దారుణమైన అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు, వారందరికీ ధన్యవాదాలు, కష్ట సమయాల్లో నన్ను తిట్టడం వల్ల ఏమీ మారదు ”అని అంటూ నటుడు దర్శన్ కుమారుడు వినీష్ సోషల్ మీడియా పోస్ట్‌లో కామెంట్ చేశాడు.
Actress Hema: బెంగళూరు జైలు నుంచి విడుదలైన సినీనటి హేమ
Also Read
- Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
- Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
- Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
దర్శన్ కొన్నేళ్లుగా చాలా వివాదాలను ఎదుర్కొన్నాడు. అయితే ఇప్పటి వరకు స్పందించని వినేష్ ఈసారి స్పందించాడు అంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉంటుందో వినేష్ మనసును ఎంత ప్రభావితం చేసి ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. దర్శన్ లివిన్ పార్టనర్ పవిత్ర గౌడకు రేణుకాస్వామి అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు ఆరోపణలు ఉన్నాయి. అది దర్శన్ దృష్టికి వెళ్లి రేణుకాస్వామిని చిత్రదుర్గ నుంచి బెంగళూరుకు పిలిపించారు. ఆ అనంతరం రేణుకాస్వామి హత్య జూన్ 8వ తేదీ రాత్రి జరిగింది. ఆ తర్వాత మృతదేహాన్ని బెంగళూరులోని ఒక కాలువలో పడేశారు. పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లోని సెక్యూరిటీ గార్డు మృతదేహాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక ఈ కేసుకు సంబంధించి 17 మంది నిందితులను విచారిస్తున్నారు. దర్శన్, పవిత్ర గౌడలకు బెయిల్ వస్తుందా? లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. .
తాజావార్తలు
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!