Site icon NTV Telugu

Chandrababu: వైసీపీకి పెయింటింగ్స్ మీద ఉండే అభిమానం ప్రజలు మీదా లేదు..

Chandrababu

Chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆకాశమే హద్దుగా కుప్పం ప్రజలు అభిమానం చూపిస్తున్నారని అన్నారు. ఈసారి కుప్పంలో లక్ష మెజారిటీ గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పెయింటింగ్స్ మీదా ఉండే అభిమానం ప్రజల మీద లేదని ఆరోపించారు. జగన్ జాబ్ క్యాలెండర్‌ విడుదల చేశాడా అని దుయ్యబట్టారు. జగన్ బటన్ నొక్కడంలో చిదంబరం రహస్యం ఉందని విమర్శించారు. సొంత పేపర్ కు యాడ్ ఇవ్వడానికి జగన్ బటన్ నొక్కుతున్నాడని చంద్రబాబు విమర్శలు గుప్పించారు. స్కూల్ బిల్డింగ్ లకు పెయింటింగ్ వేస్తే విద్యా వ్యవస్థను మార్పు చేసినట్లా ? అని ప్రశ్నించారు. జగన్ కుప్పంలోను రౌడీయిజం చేస్తున్నారని మండిపడ్డారు. ఐదేళ్ళు బాదుడే బాదుడే.. నిత్యావసర సరుకుల నుండి కరెంట్ చార్జీల వరకు అన్ని పెంచుకుంటూపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడవాళ్ళకి పది రూపాయలు ఇచ్చి.. వారి దగ్గర నుండి వంద రూపాయలు జగన్ కొట్టేస్తున్నాడని ఆరోపించారు.

Guntur Kaaram : ఆ ట్యూన్ కాపీ అంటూ మళ్ళీ థమన్ పై ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..

జగన్ కు నిద్రలేసినప్పటి నుండి అబద్ధాలు చెప్పడం అలవాటు చేసుకున్నాడని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టాలీపుడ్, బాలీపుడ్ ఇంటర్నేషనల్ కూడా బాబాయ్ హత్య లాంటి స్టోరీ ఉండదు ఏమోనని ఎద్దేవా చేశారు. గుండె పోటు అని మొదట చెప్పారు.. మళ్ళీ రక్తపు వాంతులన్నారు.. మళ్ళీ గొడ్డలి పోటు అని తేల్చారని అన్నారు. అన్ని డ్రామాలు ఆడి చివరికి నారావారి రక్తచరిత్ర అంటూ నిందలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ ప్రమేయం ఉందని సీబీఐ అరెస్టు చేయడానికి వెళితే జగన్ కష్టపడి కాపాడాడన్నారు. సింపతితో గత ఎన్నికల ఓట్లు వేసుకున్నాడని.. ఊసరవెల్లి రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ జగన్ అని దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్న మీ మరణశాసనం మీరే రాసుకున్నట్లేనని చంద్రబాబు తెలిపారు.

Traffic Restrictions: విశాఖలో రేపు, ఎల్లుండి ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు..

వైసీపీ మునిగిపోయిన పడవ.. వైసీపీ ఎమ్మెల్యేలు తలో దిక్కుకు పారిపోతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఐదేళ్ళుగా అందరినీ ఏడిపించారు.. ఇప్పుడు జగన్ వంతు వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ కుప్పంలో రావాలి.. కుప్పం కోసం కుప్పంలో పెద్దిరెడ్డి తిరుగుతున్నాడని తెలిపారు. తల్లిని, చెల్లిని పట్టించుకోని వాడు మనల్ని పట్టించుకుంటాడా అని అన్నారు. పిచ్చోడి చేతిలో రాయి ఉన్నట్లే రాష్ట్రం ఉంది.. ఇప్పటికి కొందరు అధికారులు భయపడుతున్నారు.. కాని ఎన్నికల సమయంలో వారి చేయాల్సింది చేయడానికి సిద్దంగా ఉన్నారని తెలిపారు. చివరలో కుప్పం ప్రజలకు చంద్రబాబు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పారు.

Exit mobile version