Site icon NTV Telugu

Chandrababu: ఎన్డీఏకు మద్దతు.. తేల్చేసిన చంద్రబాబు

Babu 3

Babu 3

Chandrababu: సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత జాతీయ రాజకీయాల్లో కూడా టీడీపీ పాత్ర కీలకంగా మారిపోయింది.. ఎన్డీఏ ప్రభుత్వానికి చంద్రబాబు మద్దతు తప్పనిసరి అయ్యింది.. మరోవైపు.. ఇండియా కూటమి కూడా చంద్రబాబు వైపు చూస్తుందనే వార్తలు వచ్చాయి.. చంద్రబాబు.. ఇండియా కూటమిలో చేరతారంటూ.. ఆ కూటమిలోని నేతలు వ్యాఖ్యానించడం చర్చగా మారింది.. ఈ తరుణంలో.. మా ప్రయాణం ఎన్డీఏతోనే అని స్పష్టం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఢిల్లీ వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. మేం ఎన్డీఏలో ఉన్నాం.. ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నా.. ఎన్డీఏ సమావేశానికి హాజరవుతున్నాం అని వెల్లడించారు.

Read Also: India Alliance: ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన ఇండియా కూటమి

ఇక, రాజకీయాల్లో ఒడిదుడుకులు సహజం, ఎవరూ శాశ్వతం కాదు.. అధికారం కూడా శాశ్వతం కాదన్నారు చంద్రబాబు.. అయితే, ఇంత హిస్టారికల్‌ విజయం నేను ఎప్పుడూ చూడలేదన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు చిన్నస్థాయి నుంచి పెద్దవారి వరకు వచ్చి ఓటు వేశారు.. ఇది టీడీపీ చరిత్రలో, ఏపీ రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నికలుగా అభివర్ణించారు.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి వీలులేదంటూ పవన్‌ కల్యాణ్‌ ముందుకొచ్చారు.. కూటమికి పవన్‌ బీజం వేశారని గుర్తుచేసిన ఆయన.. ఇక, బేషజాలు లేకుండా కూటమి పనిచేసింది.. పవన్‌ కల్యాణ్‌ను అభినందిస్తున్నాను అన్నారు. మాపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయం అని ప్రకటించారు.. అసెంబ్లీలో నా కుటుంబాన్ని, నన్ను ఎలా అవమానించారో నేను ఎప్పటికీ మర్చిపోలేను.. నాపై బాంబులు పడ్డప్పుడు కూడా నేను భయపడలేదు.. కౌరవ సభలో ఉండకూడదని నేను బయటికి వచ్చేశా.. మళ్లీ క్షేత్రస్థాయిలో గెలిచి.. మీ ముందుకు వచ్చాను అని వ్యాఖ్యానించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

Exit mobile version