NTV Telugu Site icon

Chandrababu: వైసీపీ ఎమ్మెల్యేలపై పేరు పేరునా చంద్రబాబు ఘాటు విమర్శలు.. ఆ ఎమ్మెల్యేపై తప్ప..!

Chandrababu

Chandrababu

Chandrababu: తిరువూరులో టీడీపీ బహిరంగ సభ నిర్వహించింది. అందులో భాగంగా.. సభలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పై చర్చ జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో అందరూ వైసీపీ ఎమ్మెల్యేలను పేరుపేరునా చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు. కానీ.. మైలవరం ఎమ్మెల్యే వసంత కృషప్రసాద్ ను మాత్రం ఒక్క మాట కూడా అనలేదు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పై మాత్రం ఏ విమర్శలు చేయకుండా చంద్రబాబు స్కిప్ చేశారు.

Read Also: Minister Bosta: విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీ అభ్యర్థిత్వంపై బొత్స రియాక్షన్..

మరోవైపు.. మైలవరం, మైలవరం అంటూ పదే పదే కార్యకర్తలు అరవటంతో మైలవరం కూడా అంతే అంటూ ముక్తసరిగా చెప్పారు చంద్రబాబు. అయితే.. చంద్రబాబు వసంత కృష్ణప్రసాద్ పై విమర్శలు చేస్తారని స్టేజీ మీద ఉన్న ఆయన దగ్గరకు దేవినేని ఉమా వచ్చారు. వసంత పై చంద్రబాబు ఏం అనక పోవటంతో దేవినేని ఉమా తిరిగి వెనక్కి వెళ్లిపోయాడు. అయితే మైలవరం ఎమ్మెల్యేపై చంద్రబాబు విమర్శలు చేయకపోవడంపై పార్టీలో చర్చ జరుగుతుంది.

Read Also: Devineni Avinash: అంబేద్కర్ ఆశయ సాధకుడు జగన్ మోహన్ రెడ్డి..