Site icon NTV Telugu

Chandrababu: 2047 వరకు భారత్‌ను నెంబర్‌వన్‌గా చేయాలనేది మోడీ సంకల్పం

Chandrababu

Chandrababu

Chandrababu: ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కల్యాణ్ అభిమతమని.. అందుకే జట్టు కట్టామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 2047 వరకు భారత్‌ను నెంబర్ వన్‌గా చేయాలనేది మోడీ సంకల్పమని తెలిపారు. ఐదేళ్లు పరదాలు కట్టుకుని జగన్ తిరిగాడని.. ఎక్కడికి వచ్చినా విధ్వంసం చేశాడు.. చెట్లు నరికేశాడని ఆరోపించారు. ఎన్నికల ముందు తల మీద చెయ్యి పెట్టాడు, ముద్దులు పెట్టాడు, బుగ్గలు నిమిరాడు…అధికారంలోకి వచ్చాక వీరబాదుడు బాదుతున్నాడన్నారు. ఏం చేశామో ఏం చేస్తామో చెప్పుకోలేక జగన్ కన్ఫ్యూజన్‌లో పడిపోయారని విమర్శించారు. తాను సంక్షేమ కార్యక్రమాలకు 19.1 శాతం ఖర్చు పెడితే.. జగన్ పెట్టింది 15.8 శాతం మాత్రమేనన్నారు. జగన్ నవరత్నాలు రాలిపోయాయని.. జగన్ నవరత్నాలలో మొదటి రత్నం ఇసుక మాఫియా అంటూ ఆరోపించారు. రాగానే ఇసుక మాఫియాను తుంగలోకి తొక్కేస్తానని… ఉచితంగా ఇసుక ఇచ్చే పూచి నాది అని హామీ ఇచ్చారు.

Read Also: Pawan Kalyan: నాకు కొడాలి నానిని తిట్టాలని ఏమీ లేదు.. కానీ..!

చంద్రబాబు నవరత్నాలపై మాట్లాడుతూ.. ” రెండో రత్నం.. మద్యం మాఫియా… జే బ్రాండ్ మద్యంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుంది.. జే బ్రాండ్ మద్యం రద్దు చేస్తా… మందు బాబుల ఆరోగ్యం కాపాడుతా.. మూడో రత్నం… భూ మాఫియా. పట్టా దారు పాసు పుస్తకాలపై జగన్ ఫోటోలు వేస్తున్నారు.. మీ భూములన్నీ జగన్ తన ఆన్లైన్‌లో పెట్టుకుంటాడు.. మీ భూమి మీది కాదు ఇప్పుడు.. జగన్ గుప్పెట్లో వుంది.. ఆయన ఒక ప్రైవేటు కంపెనీ పెట్టుకుని అందులో రికార్డులు అన్ని పెట్టుకుంటున్నాడు. ఇది నల్ల చట్టం.. జగన్ ల్యాండ్ గ్రాబ్బింగ్ యాక్ట్ ఇది.” అంటూ తీవ్రంగా విమర్శించారు. 2014 లో తండ్రి లేని బిడ్డను అంటూ మీ ముందుకు వచ్చాడని.. రిలయన్స్ పైన దాడులు చేశాడన్నారు. 2019 లో రిలయన్స్ మనిషికి రాజ్యసభ ఎంపీ ఇచ్చాడని విమర్శించారు.

Exit mobile version