ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని పవన్ కల్యాణ్ అభిమతమని.. అందుకే జట్టు కట్టామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 2047 వరకు భారత్‌ను నెంబర్ వన్‌గా చేయాలనేది మోడీ సంకల్పమని తెలిపారు. ఐదేళ్లు పరదాలు కట్టుకుని జగన్ తిరిగాడని.. ఎక్కడికి వచ్చినా విధ్వంసం చేశాడు.. చెట్లు నరికేశాడని ఆరోపించారు.