Chandrababu: ఇది హిస్టారికల్ విజయం.. నేనెప్పుడూ చూడలేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఆనందం వ్యక్తం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఇది హిస్టారికల్ విజయం.. నేనెప్పుడూ చూడలేదన్నారు.. ఎన్డీఏ సమావేశం కోసం ఢిల్లీ బయల్దేరేముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. మీడియాకు స్వాతంత్రం వచ్చిందంటూ ప్రెస్ మీట్ మొదలు పెట్టారు.. ప్రజలకు శిరస్సు వంచి ధన్యావాదాలు చెబుతున్నా. గత ఐదేళ్లల్లో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నా జీవితంలో చూడలేదు. అన్ని వ్యవస్ధలను ధ్వంసం చేశారు. ప్రజలు గెలవాలి.. రాష్ట్రం నిలబడాలనే నినాదంతో వెళ్లామని గుర్తుచేసుకున్నారు. రాజకీయాల్లో ఒడిదుడుకులు ఉంటాయి.. ఏదీ శాశ్వతం కాదన్న చంద్రబాబు.. ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే వ్యక్తులు.. రాజకీయ పార్టీలు కనుమరుగు అవుతాయని వార్నింగ్ ఇచ్చారు.
Read Also: Chandrababu: ఎన్డీఏకు మద్దతు.. తేల్చేసిన చంద్రబాబు
Also Read
- Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!
- 144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
- Supreme Court: X, ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్‌లో కీలక అంశాలు..
ఎక్కడో దూర తీరాల్లో ఉన్నవాళ్లు.. కూలీ పనులు చేసుకునే వాళ్లు కష్టంతో వచ్చి ఓటేశారని వెల్లడించారు చంద్రబాబు.. టీడీపీ చరిత్రలో.. ఏపీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నికలివి.
1984, 1994ను మించిన స్థాయిలో ఇప్పుడు ప్రదల నుంచి రియాక్షన్ వచ్చిందన్నారు. ప్రజలు స్వేచ్ఛని కొల్పోయారు. అందరం కలిశాం.. ఎన్నికల్లో పోటీ చేశాం. కంచుకోటలు బద్దలు చేశాం. మెజార్టీలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఈ ఎన్నికలను ఏ విధంగా అభివర్ణించాలో అర్థం కావడం లేదన్నారు. అహకారం, నియంతృత్వం, విచ్చలవిడి తత్వం వంటివి ప్రజలు సహించరు. ప్రజలు గుణపాఠం నేర్పించారన్నారు.. ఐదేళ్లు ఎన్నో ఇబ్బందులు పడ్డాం. నిద్రలేని రాత్రులు గడిపాం. జై జగన్ అనకుంటే చంపేస్తామన్నా.. లెక్క చేయకుండా జై తెలుగుదేశం అని నినాదాలు చేసిన చంద్రయ్య లాంటి కార్యకర్తలను ఎలా మరువగలం అని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
The Paradise : అనిరుధ్‌ను ఆశీర్వదించిన కాసర్ల శ్యామ్.. ‘ది పారడైజ్’ సెకండ్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది
-
Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!
-
Maharashtra Hill Tragedy: తల్లిదండ్రులను కలపాలని కునాల్ చనిపోయాడా? సంభాజీనగర్ ఎపిసోడ్లో న్యూ ట్విస్ట్!
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
Supreme Court: X, ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?