Chandrababu : నేడు కర్నూలు జిల్లాలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేడు కర్నూలు జిల్లాలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లోని ప్రచారంలో చంద్రబాబు పాల్గొంటారు. మంత్రాలయం, కొడుమూరు సెగ్మెంట్లో ప్రజాగళం నిర్వహిస్తారు. అలాగే కౌతాలం, గూడూరు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు చంద్రబాబు. ఈ రోజు సాయంత్రం 3.50 గంటలకు నెల్లూరు నుంచి కౌతాలంకు వస్తారు. రాత్రి గూడూరులోనే బస చేస్తారు చంద్రబాబు. కాగా చంద్రబాబు నాయుడు సోమవారం నందికొట్కూరులో పర్యటించనున్నారని ఆ పార్టీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి అన్నారు. శనివారం అల్లూరు గ్రామ సమీపంలో హెలిప్యాడ్ స్థలాన్ని మాండ్ర శివానందరెడ్డి, డీఎస్పీ శ్రీనివాసులు పరిశీలించారు.
Also Read
- Sunil Gavaskar: గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌పై గవాస్కర్ ప్రశంసలు.. ఆ 'గట్ ఫీల్' గురించే అంటూ వ్యాఖ్యలు..
- WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్‌లో చెల్లింపు సేవల ఆరంభం
- IPL 2027: గంగూలీ మాస్టర్ ప్లాన్.. ఐపీఎల్ 2027లో ఆ జట్టుకు కోచ్‌గా యువరాజ్ సింగ్..
- Supreme Court: ఫుట్‌పాత్‌పై నడవడం ప్రాథమిక హక్కు.. ప్రత్యేక చట్టం తేవాలని కేంద్రానికి సూచన
అనంతరం మాండ్ర శివానందరెడ్డి మాట్లాడుతూ సోమవారం సాయంత్రం 5 గంటలకు చంద్రబాబు హెలికాప్టర్లో అల్లూరు గ్రామం వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారని, అక్కడి నుంచి నందికొట్కూరు అల్లూరు సర్కిల్, కొత్త బస్టాండ్ మీదుగా పటేల్ సెంటర్ వరకు రోడ్డు షో, పటేల్ సెంటర్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారన్నారు. అనంతరం అల్లూరు గ్రామం వద్ద బస చేస్తారన్నారు. 30వ తేదీ ఉదయం అక్కడి నుంచి బయలుదేరతారని ఆయన తెలిపారు. హెలిప్యాడ్ ప్రదేశాన్ని పరిశీలించిన వారిలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గిత్తా జయసూర్య, నియోజకవర్గ పరిశీలకుడు శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ వీరం ప్రసాద్‌రెడ్డి ఉన్నారు.
తాజావార్తలు
-
Sunil Gavaskar: గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌పై గవాస్కర్ ప్రశంసలు.. ఆ ‘గట్ ఫీల్’ గురించే అంటూ వ్యాఖ్యలు..
-
Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
-
WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్‌లో చెల్లింపు సేవల ఆరంభం
-
KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
-
Thaman S: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తమన్.. ఆ పిల్లల స్కూల్ ఫీజులు కట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్‌కు భారీ షాక్.. ప్రపంచ కప్‌కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్‌తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?