Site icon NTV Telugu

Chandrababu Bail Cancellation Petition: చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్‌.. విచారణ వచ్చే నెలకు వాయిదా

Babu

Babu

Chandrababu Bail Cancellation Petition: ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెయిల్‌ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.. ఏప్రిల్‌ 16వ తేదీన ఈ పిటిషన్‌పై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టనున్నట్టు జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్‌ మిట్టల్‌ ధర్మాసనం పేర్కొంది.. కాగా, చంద్రబాబు కుటుంబం అధికారులను బెదిరిస్తోందని, వెంటనే బెయిల్‌ రద్దు చేయాలని గత వాదనల సందర్భంగా సుప్రీంకోర్టును కోరారు ప్రభుత్వం తరపు న్యాయవాదులు. అందుకు సంబంధించిన వివరాలతో ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌ దాఖలు చేసినట్లు జస్టిస్‌ బేలాఎం త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ ధర్మాసనంకు తెలిపారు న్యాయవాదులు. ప్రభుత్వం దాఖలు చేసిన ఐఏపై సమాధానం ఇవ్వాలనుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్‌ సాల్వే.. దీంతో.. తదుపరి విచారణ మూడు వారాల పాటు వాయిదా పడగా.. ఆ వాయిదా ప్రకారం ఈ రోజు విచారణ జరగగా.. మళ్లీ 16వ తేదీకి వాయిదా పడింది.

Read Also: Narendra Modi: కేరళలోనూ కమలం వికసిస్తుందంటున్న మోడీ..!

అయితే, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో ఏపీ హైకోర్టు.. చంద్రబాబుకి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.. స్కిల్‌ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేయగా.. ఆయన రాజమండ్రి సెంట్రల్‌ జైలులో 50 రోజులకు పైగా రిమాండ్‌లో ఉన్నారు.. ముందు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు.. ఆ తర్వాత రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేసిన విషయం విదితమే.. దీంతో. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టు మెట్లు ఎక్కింది.. ఆ పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరిగింది. ఈ సందర్భంగా బెయిల్‌ రద్దుపై ఏప్రిల్‌ 16న పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంటి.. విచారణను వాయిదా వేసింది.

Exit mobile version