NTV Telugu Site icon

Supreme Court: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌.. నేడు సుప్రీంకోర్టులో విచారణ

Chandrababu

Chandrababu

Supreme Court: ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవపల్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బెయిల్‌ మంజూరు అయిన విషయం విదితమే.. అయితే, చంద్రబాబు బెయిల్‌ రద్దు పిటిషన్ పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.. స్కిల్ కేసులో చంద్రబాబుకి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేసింది సీఐడీ.. ఆ పిటిషన్‌పై నేడు జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరపనుంది.. చంద్రబాబుకు బెయిల్‌ మంజూరులో తమ వాదనలు, ఆధారాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని పిటిషన్ లో సీఐడీ పేర్కొంది..

Read Also: IND vs AUS: 9 నెలల వ్యవధిలో మూడు ఐసీసీ ఫైనల్స్‌ ఓటములు.. ఆస్ట్రేలియా గండాన్ని దాటలేమా?

అయితే, జనవరి 19వ తేదీన విచారణ సందర్భంగా కౌంటర్ దాఖలుకు సమయం కావాలని సుప్రీంకోర్టును కోరారు చంద్రబాబు తరపు న్యాయవాదులు.. ఇరు పక్షాలూ తమ వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించాలని సూచించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. విచారణను ఫిబ్రవరి 12వ తేదీ.. అంటే ఇవాళ్టికి వాయిదా వేసింది.. దీంతో. ఇవాళ్టి విచారణ ఎలా ఉండబోతోంది అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. కాగా, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబును సీఐడీ అరెస్ట్‌ చేసిన విషయం విదితమే కాగా.. 50 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో గడిపారు చంద్రబాబు.. ఇక, మొదట మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన హైకోర్టు.. ఆ తర్వాత రెగ్యులర్‌ బెయిల్‌ను మంజూరు చేసింది.. దీంతో.. ఏపీ హైకోర్టు బెయిల్‌ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది ఏపీ సీఐడీ.