NTV Telugu Site icon

Chandra Mohan: చంద్రమోహన్‌తో నటిస్తే చాలు.. స్టార్స్‌ అయిపోతారు!

Jayaprada Jayasudha

Jayaprada Jayasudha

Chandra Mohan is a Heroine’s Lucky Hand: ప్రస్తుత తరానికి చంద్రమోహన్‌ అంటే ఓ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ అని మాత్రమే తెలుసు. ఒకప్పుడు ఆయన స్టార్‌ హీరో అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్, శోభన్ బాబు, కృష్ణం రాజులకు ధీటుగా సినిమాలు చేశారు. చంద్రమోహన్‌కు ‘నిర్మాత హీరో’ అనే ట్యాగ్ కూడా ఉంది. ఆయన నటించిన సినిమాలు ఎక్కువ శాతం విజయవంతం అయినవే ఉండడం అందుకు కారణం. వరుస విజయాల కారణంగా నిర్మాతలు ఆయనతో సినిమాలు చేసేందుకు ఇష్టపడేవారు. కేవలం నిర్మాతలు మాత్రమే కాదు.. హీరోయిన్లు కూడా ఆయనతో నటించడానికి ఆసక్తి చూపించేవారు.

ఇండస్ట్రీలో చంద్రమోహన్‌ను ‘హీరోయిన్స్‌ లక్కీ హ్యాండ్‌’ అనేవాళ్లు. ఎందుకంటే.. ఆయనతో నటిస్తే చాలు ఆ హీరోయిన్‌ స్టార్‌ అయిపోతుంది. జయప్రద, శ్రీదేవి, జయసుధ, విజయశాంతి, సుహాసిని.. ఇలా చాలా హీరోయిన్లు చంద్రమోహన్‌తో నటించిన తర్వాతే స్టార్ స్టేటస్ అందుకున్నారు. చంద్రమోహన్‌ పక్కన హీరోయిన్‌గా నటిస్తే తిరుగు ఉండదనే భావన అప్పట్లో చాలా మంది హీరోయిన్లలో ఉండేది.

Also Read: Chandra Mohan Death: చంద్రమోహన్‌ గారి అకాల మరణం బాధాకరం: ఎన్టీఆర్‌

‘సిరి సిరిమువ్వలు’ చిత్రంలో చంద్రమోహన్‌ హీరో కాగా.. జయప్రద హీరోయిన్‌. అప్పటివరకు పెద్దగా గుర్తింపు లేని జయప్రదను ఆ చిత్రం స్టార్‌ హీరోయిన్‌గా మార్చింది. పదహారేళ్ల వయసు చిత్రంలో చంద్రమోహన్‌ సరసన నటించిన దివంగత నటి శ్రీదేవి.. స్టార్‌ హీరోయిన్‌ అయిపోయారు. ప్రాణం ఖరీదు చిత్రం జయసుధకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టగా.. పెళ్లి చూపులు సినిమా విజయశాంతికి లైఫ్ ఇచ్చింది. ఇలా చాలామంది హీరోయిన్లను చంద్రమోహన్‌ స్టార్స్‌ చేశారు.

Show comments