Chandra Mohan Death: చంద్రమోహన్ గారి అకాల మరణం బాధాకరం: ఎన్టీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Celebrities mourn the death of Chandra Mohan: సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చంద్రమోహన్ మృతికి సంతాపం ప్రకటిస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చంద్రమోహన్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, సాయి తేజ్.. ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చంద్రమోహన్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.
‘ఎన్నో దశాబ్దాలుగా చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న చంద్రమోహన్ గారు అకాల మరణం చెందడం బాధాకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’ అని జూనియర్ ఎన్టీఆర్ తన ఎక్స్‌లో పేర్కొన్నారు.
Also Read
- 2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
‘విలక్షణ నటుడు చంద్రమోహన్ అకాల మరణం సినిమా జగత్తుకు తీరని లోటు. ఆయనతో పలు సినిమాల్లో కలిసి నటించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని కల్యాణ్ రామ్ ట్వీట్ చేశారు.
Also Read: Chandra Mohan: చంద్రమోహన్ చివరి సినిమా ఇదే!
‘చంద్రమోహన్ మోము మనకు అద్భుతమైన జ్ఞాపకాలు గుర్తుచేస్తుంది. ఆయన చిరస్మరణీయమైన నటన, అద్భుతమైన పాత్రలతో ప్రతిసారీ మన పెదవులపై చిరునవ్వు విరుస్తుంది’ సాయి ధరమ్ తేజ్ పేర్కొన్నారు.
‘ప్రముఖ నటుడు చంద్రమోహన్ గారు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూయడం బాధాకరం. తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న ఆయన తెలుగు, తమిళ భాషల్లో వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. చంద్రమోహన్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
‘సీనియర్ నటుడు చంద్రమోహన్ మృతి బాధాకరం. హీరో, కమెడియన్, సహాయ నటుడిగా విభిన్న పాత్రలు అలవోకగా పోషించిన ఆయన మరణం తెలుగు చిత్ర పరిశ్రమకి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా’ అని నారా లోకేశ్ పేర్కొన్నారు.
ప్రముఖ నటుడు చంద్రమోహన్ గారు అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్ను మూయడం బాధాకరం. తొలి సినిమాకే నంది అవార్డును గెలుచుకున్న ఆయన తెలుగు, తమిళ భాషల్లో వందలాది సినిమాల్లో నటించి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. చంద్రమోహన్ గారి కుటుంబ సభ్యుల… pic.twitter.com/XklbQ0l1o5
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 11, 2023
విలక్షణ నటుడు చంద్రమోహన్ గారి అకాల మరణం సినిమా జగత్తుకు తీరని లోటు.
ఆయనతో పలు సినిమాల్లో కలిసి నటించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను.
ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) November 11, 2023
ఎన్నో దశాబ్దాలుగా చలనచిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పొషించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్న చంద్రమోహన్ గారు అకాల మరణం చెందడం చాలా బాధాకరం.
వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్దిస్తున్నాను.
— Jr NTR (@tarak9999) November 11, 2023
తాజావార్తలు
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?