Champion: తెలంగాణలోని భైరాన్‌పల్లి గ్రామ నేపథ్యంలో రూపొందించిన సినిమా ‘ఛాంపియన్’. జీ స్టూడియోస్ సమర్పణలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్‌తో కలిసి స్వప్న సినిమాస్ బ్యానర్‌పై నిర్మించారు. డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకొని థియేటర్స్‌లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ రోజు మేకర్స్ ఛాంపియన్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
READ ALSO: Mega Victory Mass Song: మెగా విక్టరీ మాస్ సాంగ్‌కు ముహూర్తం ఫిక్స్..
ఈ సందర్భంగా హీరో రోషన్ మాట్లాడుతూ.. ‘ఛాంపియన్ సినిమా నాకు చాలా స్పెషల్. ఈ ప్రాజెక్టుకి నేను ఎమోషనల్ అటాచ్ అయ్యాను. కళ్యాణ్ చక్రవర్తితో నటించడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. అనస్వర చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. తనతో మళ్ళీ కలిసి పనిచేయాలని ఉంది. ఈ సినిమాని ఇండస్ట్రీలో చాలా మంది సపోర్ట్ చేశారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ అని అన్నారు.
డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం మాట్లాడుతూ.. ‘ఛాంపియన్ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి కారణం నిర్మతలు స్వప్న, కిరణ్, జి కే, జి స్టూడియోస్. నాలుగేళ్ల క్రితం ఈ కథని నిర్మాత స్వప్నకి చెప్పాను. అప్పుడే ఈ సినిమా చేస్తున్నామని వాళ్లు సైన్ చేశారు. ఈ సినిమా క్లైమాక్స్ ని 18 రోజులు షూట్ చేశాము, అది మామూలు యాక్షన్ సీక్వెన్స్ కాదు, అది ఒక ఊరి మీద జరిగిన దారుణమైన దాడి, ఒక యుద్ధం’ అని అన్నారు. ప్రొడ్యూసర్ స్వప్న దత్ మాట్లాడుతూ… ‘వైజయంతి మూవీస్ కి 50 ఇయర్స్, స్వప్న సినిమాస్ మొదలై కూడా 25 ఏళ్లు అవుతుంది. ఈ రెండు బ్యానర్స్‌లో ఎప్పుడు కూడా మేము ఈజీ సినిమాలు చేయలేదు. ప్రతిసారి ఒక ఛాలెంజింగ్‌గా ఉన్న కథలు ఎంచుకుని సినిమాలు చేస్తున్నాం. ఈ కష్టమైనా సినిమాల్లోనే ఒక తృప్తి ఉంది. డబ్బు అనేది అవసరమే కానీ, సాటిస్ఫాక్షన్ అనేది ఇంకా ముఖ్యం. అందుకే సాటిస్ఫాక్షన్ ఇచ్చే సినిమాలు చేస్తున్నాం’ అని అన్నారు.