Municipality: నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని.. డోర్నకల్, తొర్రూరు, జనగామ మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు..

  • తెలంగాణలో 11 మున్సిపాలిటీలలో కోరం లేక ప్రమాణస్వీకారం నేటికి వాయిదా
  • ఇవాళ కూడా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కొనసాగనున్నది
  • కొన్నిచోట్ల పార్టీల మధ్య చిత్రమైన పొత్తులు
Muncipalty

Muncipalty

తెలంగాణలో 11 మున్సిపాలిటీలలో కోరం లేక ప్రమాణస్వీకారం నేటికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇల్లెందు, సుల్తానాబాద్, ఇబ్రహీంపట్నం, కాగజ్‌నగర్, కేతనపల్లి, ఖానాపూర్, జహీరాబాద్, ఇంద్రేశం, డోర్నకల్, జనగాం, తొర్రూర్ లలో వాయిదా పడింది. ఇవాళ కూడా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కొనసాగనున్నది. ఈ నేపథ్యంలో పీఠం దక్కించుకునేందుకు కొనసాగుతున్న కౌన్సిలర్ల బుజ్జగింపులు, బేరసారాలు..కొన్నిచోట్ల పార్టీల మధ్య చిత్రమైన పొత్తులు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

Also Read:Tuesday Astrology: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!

నిన్న కోరం లేక డోర్నకల్ మున్సిపల్ పాలకమండలి ప్రమాణ స్వీకారం నిలిచిపోయింది. నేడు చైర్మన్ వైస్ చైర్మన్ ల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. నిన్న గందరగోళ పరిస్థితుల మధ్య వాయిదా పడ్డ జనగామ, తొర్రూరు మున్సిపాలిటీలకు నేడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించనున్నారు. చైర్మన్ పీఠం దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ పార్టీలు పోటీపడుతున్నాయి. రెండు పార్టీల ఎత్తులు పైఎత్తులతో తొర్రూరు, జనగామలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

నిన్న జరిగిన ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మధ్యాహ్నం 12 గంటలకు క్యాంపు నుంచి నేరుగా కౌన్సిల్ హాల్ కు చేరుకొని ఉన్న రెండు పార్టీల కౌన్సిల్ సభ్యులు. మెజార్టీ ఉన్న బీఆర్ఎస్ కి చైర్మన్ పీఠం దక్కకుండా అడ్డుకున్న కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పేందుకు భారీగా తొర్రూరు తరలిరావాలని తన కేడర్‌కు పిలుపునిచ్చారు మాజీ మంత్రి దయాకర్ రావు.. తొర్రూరు జనగామ మున్సిపాలిటీలను దక్కించుకునేందుకు రెండు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.

Also Read:Andhra Pradesh: రెవెన్యూ శాఖలో ఆ పోస్టు పేరు మార్పు

తొర్రూరు మున్సిపాలిటీ గెలుపు కోసం మాజీ మంత్రి దయాకర్ రావు, Mlc మధుసూదనాచారి, సత్యవతి రాథోడ్, పెద్ది సుదర్శన్ రెడ్డిలకు బాధ్యత అప్పజెప్పింది బీఆర్ఎస్ అధిష్టానం. Mla యశస్విని రెడ్డి తో పాటు ఎంపీ రఘురామారెడ్డి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తొర్రూర్ మున్సిపల్ బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్. రెండు పార్టీల పోటాపోటీతో తొర్రూర్ లో కొనసాగుతున్న టెన్షన్ వాతావరణం.. జనగామలోనూ కొనసాగుతున్న ఉత్కంఠ. రెండు పార్టీలకు సమంగా బలం ఉండడంతో జనగామ మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది.