NTV Telugu Site icon

Chahal-Dhanashree: ధనశ్రీతో విడాకుల వార్తలపై తొలిసారి స్పందించిన చాహల్..

Chahal

Chahal

2021లో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకుల వార్తలు హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే.. ఆ విషయాన్ని మరింత నమ్మేలా చాహల్, ధనశ్రీ ఇద్దరూ తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల నుండి ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. అంతేకాకుండా.. ఫోటోలను డిలేట్ చేసుకోవడంతో వీరిద్దరూ విడిపోతున్నట్లు వార్తలు వెలుగులోకి వచ్చాయి. అయితే.. ఈ జంట మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నాయనేది ఇంకా క్లారిటీ లేదు.

Read Also: India-Bangladesh: భారత్- బంగ్లా సరిహద్దుల్లో కంచె నిర్మాణంపై ఉద్రిక్తత..

ఈ క్రమంలో యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీల ఫొటోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. అందులో.. చాహల్ వైరల్ వీడియోలో ఒక మిస్టరీ అమ్మాయితో కనిపించాడు. ఈ వీడియో తర్వాత.. చాహల్, ధనశ్రీల మధ్య మనస్పర్థలు రావడానికి ఆ అమ్మాయి కారణమేమోనని చర్చ జరుగుతోంది. వాస్తవం ఏంటనేది ఎవరికీ తెలియదు. ఇంతలో యుజ్వేంద్ర చాహల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశాడు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Read Also: US: విషాదం.. భోజనం చేస్తుండగానే యూఎస్ ఇన్‌ఫ్లుయెనర్స్ హఠాన్మరణం

ధనశ్రీతో విభేదాల వార్తలపై యుజ్వేంద్ర చాహల్ మొదటిసారి మౌనం వీడాడు. వాస్తవానికి, యుజ్వేంద్ర, ధనశ్రీ మధ్య కొంత విబేధాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 2025 జనవరి 7న యుజ్వేంద్ర తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశాడు. ‘నిశ్శబ్దం లోతైన స్వరం, ఇది అన్ని శబ్దాల కంటే ఎక్కువగా వినబడుతుంది.’ అని తెలిపాడు. చాహల్ షేర్ చేసిన ఈ పోస్ట్‌పై అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. ధనశ్రీ, చాహల్ 22 డిసెంబర్ 2020న వివాహం చేసుకున్నారు. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత వీరి విడాకుల వార్త పుకార్లు షికార్లు చేస్తున్నాయి. 2024లో ధనశ్రీ తన ఇంటిపేరు నుండి ‘చాహల్’ని తొలగించడంతో ఈ జంట విడాకుల వార్తలు ఊపందుకున్నాయి.

Show comments