Site icon NTV Telugu

Hyderabad: మియాపూర్లో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్..

Cheddigand

Cheddigand

చాలా రోజుల తర్వాత చెడ్డీ గ్యాంగ్ సంచారం మళ్లీ కలకలం రేపుతోంది. శనివారం అర్ధరాత్రి మియాపూర్లో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేసింది. వరల్డ్ వన్ స్కూల్ లోకి కొంతమంది చెడ్డీలు ధరించి.. ముఖానికి మాస్క్ కట్టుకుని పదునైన ఆయుధాలతో ఒంటిమీద బట్టలు లేకుండా చొరబడ్డారు. అనంతరం స్కూల్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో గల కౌంటర్ లో ఉన్న 7 లక్షల 85 వేల నగదును దొంగలు దోచుకెళ్లారు.

Read Also: WPL 2024 Final: బౌలింగ్‌తో ఆకట్టుకున్న శ్రేయాంక.. 113 పరుగులకే ఢిల్లీ ఆలౌట్

అయితే.. దొంగతనం దృశ్యాలు స్కూల్ లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఒంటిమీద బట్టలు లేకుండా చడ్డీలతో వచ్చిన దొంగలు కనిపించారు. దీంతో.. స్కూల్ యాజమాన్యం మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే.. ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు.. స్కూల్ లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ ను స్వాధీనం చేసుకున్నారు. దాని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: BRS: దానంపై అనర్హత వేటు పిటిషన్ సమర్పించేందుకు సిద్ధమైన బీఆర్ఎస్..

Exit mobile version