Food Habits: మనలో దాదాపు అందరం పొద్దున్నే లేవగానే బ్రేక్ ఫాస్ట్ కోసం ఇడ్లీ, దోశ, వడ, పూరి అంటూ తెగ లాగిచ్చేస్తున్నాం. కానీ, మన పూర్వికులు అయితే పొద్దున్నే చద్దన్నం (చల్ది అన్నం) తీసుకునే వారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని పెద్దవాళ్ళు చెప్పడం మనం విని ఉంటాము. నిజానికి ఇడ్లీ, దోశల కంటే చద్దన్నం తినడం 100 రెట్లు బెటర్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడున్న డయాబెటిస్, బీపీ, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. కొన్ని పాశ్చత్య దేశాలలో ఈ చద్దన్నంకు చాలా డిమాండ్ ఉందంటే నమ్మండి. అక్కడ వారు దీనికోసం భారీగా ఖర్చు చేస్తారు కూడా. మనం అయితే ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ ప్రాచీన ఆహారం మన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుందే కాకుండా, శరీర తాపాన్ని తగ్గిస్తుంది. వేసవిలో ఇది మంచి శీతలకర ఆహారంగా ఉపయోగపడుతుంది. మరి ఈ చద్దన్నమును ఎలా చేసుకొని తింటే లాభాలు అధికంగా పొందవచ్చో ఒకసారి చూద్దామా..
Also Read: Sperm Count: వీటిని తీసుకోవడం ఆపకపోతే స్పెర్మ్ కౌంట్ తగ్గడం గ్యారెంటీ.. జాగ్రత్త సుమీ
చద్దన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు:
* మెత్తగా ఉడికించిన తెల్ల అన్నం
* ఒక కప్పు మజ్జిగ
* ఒక కప్పు గోరు వెచ్చని పాలు
* రెండు పెద్ద ముక్కల ఉల్లిపాయ
* రెండు పచ్చిమిర్చి
* ఒక కప్పు వేడి నీరు
* రుచికి సరిపడా ఉప్పు
ముందుగా వైట్ రైస్ ను మెత్తగా ఉడికించాలి. ఆ తర్వాత ఓ మట్టి పాత్రలో 1.5 కప్పుల అన్నం తీసుకుని అందులో 1 కప్పు వేడి నీళ్లు, 1 కప్పు గోరు వెచ్చని పాలు పోయాలి. ఆపై ఓ 3 నిమిషాల తర్వాత మూడు టేబుల్ స్పూన్ల మజ్జిగ, ఉల్లిపాయ ముక్కలు, రెండు పచ్చిమిర్చి వేసి బాగా కలిపి రాత్రంతా మూతపెట్టి ఉంచాలి. ఇక తెల్లవారిన తర్వాత మూత తీసి రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి తినాలి. అంతే ఎంతో మేలు చేసే చద్దన్నం రెడీ.
Also Read:Delhi: పంజాబ్ ప్రభుత్వంలో అలజడి.. కేజ్రీవాల్‌తో కేబినెట్, ఎమ్మెల్యేల భేటీ
ఇలా చద్దన్నం తినడం వల్ల కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే.. ముఖ్యంగా శరీరాన్ని చల్లబరుస్తుంది. అలాగే జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అదనంగా డయాబెటిస్, బీపీ, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఏదైనా పునరుత్పత్తి సమస్యలు ఉంటే వాటికి మేలు చేస్తుంది. శరీరానికి పుష్టిని, తక్షణ శక్తిని అందిస్తుంది. వేసవి కాలంలో ఒంటిని చల్లబరుచుకునే సహజ మార్గం కావాలనుకుంటే చద్దన్నం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరం. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఆరోగ్యకరమైన చద్దన్నం ట్రై చేయండి.