Apple Devices: మీరు యాపిల్ డివైజ్‌లు వాడుతున్నారా?.. ఈ అలర్ట్ మీకోసమే!
- యాపిల్ డివైజ్‌లు వాడుతున్న వారికి అలర్ట్
- సమాచారం తస్కరించే అవకాశం
- కొత్త సెక్యూరిటీ అప్‌డేట్‌ను తీసుకొచ్చిన యాపిల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ ‘యాపిల్’కు చెందిన ఐఫోన్స్, మ్యాక్స్, యాపిల్ వాచీలు వాడుతున్న వారిని కేంద్రం అలర్ట్ చేసింది. ఔట్ డేటెడ్ సాఫ్ట్‌వేర్ వాడుతున్న డివైజుల్లో సెక్యూరిటీ లోపాలు ఉన్నట్లు గుర్తించింది. ఈ లోపాలను అత్యంత తీవ్రమైనవిగా పేర్కొంది. ఈ మేరకు కేంద్ర సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ‘కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా’ (సెర్ట్-ఇన్) ఓ అడ్వైజరీని జారీ చేసింది. సైబర్ నేరగాళ్లు డివైజుల్లోని సున్నితమైన సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందని హెచ్చరించింది.
పాత సాఫ్ట్‌వేర్‌లో సెక్యూరిటీ లోపాల కారణంగా.. యాపిల్ డివైజుల్లో నేరగాళ్లు అక్రమంగా చొరబడి సెన్సిటివ్ డేటాను యాక్సెస్ చేయడం లేదా డేటా మానిప్యులేషన్‌కు పాల్పడే అవకాశం ఉందని సెర్ట్-ఇన్ పేర్కొంది. ఐఓస్ 18.1 కంటే ముందు వెర్షన్ లేదా 17.7.1 కలిగిన ఐఫోన్లు, ఐప్యాడ్ ఓస్ 18.1 కంటే ముందు లేదా 17.7.1 వెర్షన్ కలిగిన ఐప్యాడ్‌లు, పాత మ్యాక్ ఓఎస్ వాడుతున్న మ్యాక్‌లు, వాచ్ ఓఎస్ 11 కంటే ముందు సాఫ్ట్‌వేర్ కలిగిన వాచ్‌లకు ఈ ప్రమాదం పొంచి ఉందని సెర్ట్-ఇన్ తెలిపింది. పాత టీవీఓఎస్, విజన్‌ఓఎస్, సపారీ బ్రౌజర్లకూ ఈ ముప్పు పొంచిఉంది.
Also Read
- Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
- Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
- T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
- CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
పాత సాఫ్ట్‌వేర్‌లో లోపాలను యాపిల్ ఇదివరకే గుర్తించి… కొత్త సెక్యూరిటీ అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. ఎవరైతే పాత సాఫ్ట్‌వేర్ వెర్షన్లు వాడుతున్నారో వారు వెంటనే తమ డివైజ్‌లను అప్‌డేట్ చేసుకోవాలని యాపిల్ సూచించింది. లోపాల నుంచి డివైజులను సురక్షితంగా ఉంచుకునేందుకు యూజర్లు ఎప్పటికప్పుడు సెక్యూరిటీ ప్యాచ్‌ను అప్‌డేట్ చేసుకోవాలని తెలిపింది. ఆండ్రాయిడ్ ఫోన్‌లను వినియోగిస్తున్న వారికి కూడా సెర్ట్-ఇన్ హెచ్చరిస్తుందన్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Smriti Mandhana: పరుగుల రారాణి స్మృతి మంధాన.. టీ20 క్రికెట్లో అరుదైన ఘనత..!
-
Irumudi OTT: ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న ‘ఇరుముడి’.. నెట్‌ఫ్లిక్స్‌లో నెం.1గా ట్రెండింగ్!
-
Oppo A7 Pro Max 5G: ఒప్పో A7 Pro Max 5G గ్లోబల్ లాంచ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా!
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!