అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ ‘యాపిల్’కు చెందిన ఐఫోన్స్, మ్యాక్స్, యాపిల్ వాచీలు వాడుతున్న వారిని కేంద్రం అలర్ట్ చేసింది. ఔట్ డేటెడ్ సాఫ్ట్‌వేర్ వాడుతున్న డివైజుల్లో సెక్యూరిటీ లోపాలు ఉన్నట్లు గుర్తించింది. ఈ లోపాలను అత్యంత తీవ్రమైనవిగా పేర్కొంది. ఈ మేరకు కేంద్ర సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ‘కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా’ (సెర్ట్-ఇన్) ఓ అడ్వైజరీని జారీ చేసింది. సైబర్ నేరగాళ్లు డివైజుల్లోని సున్నితమైన సమాచారాన్ని తస్కరించే అవకాశం ఉందని…