Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Central Government New Rules For Toll Gate Collections

Toll Gates: టోల్ వసూళ్లపై కేంద్రం కొత్త రూల్స్

Published Date :October 5, 2022 , 2:21 pm
By Rakesh Reddy
Toll Gates: టోల్ వసూళ్లపై కేంద్రం కొత్త రూల్స్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Toll Gates: టోల్ వసూళ్లపై కేంద్రం కొత్త నిబంధనలను తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఈ నిబంధనల ప్రకారం వాహన పరిమాణం, తిరిగిన దూరం ఆధారంగానే టోల్ వసూళ్లు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టోల్ విధానాన్ని ప్రక్షాళ‌న చేస్తున్న క్రమంలో వాహ‌నం ప‌రిమాణం, తిరిగిన దూరం ఆధారంగా టోల్ వ‌సూలు చేసే విధానం అమల్లోకి రానుంది. యూజ‌ర్లు వాడిన విద్యుత్‌కు ఎలాగైతే బిల్లు చెల్లిస్తారో అదే త‌ర‌హాలో వాహ‌నం పరిమాణం, రోడ్డుపై అది ప్రయాణించిన దూరం ఆధారంగా జాతీయ ర‌హ‌దారుల‌పై టోల్ వ‌సూలు చేయనున్నారు.

త్వరలో టోల్ ప్లాజాలు తొలగింపు
టోల్ వ‌సూళ్ల ప్రక్రియ మ‌రింత స‌మ‌ర్ధంగా ఉండేలా టోల్ విధానాన్ని ప్రక్షాళ‌న చేయాల‌ని కేంద్రం యోచిస్తోంది. నూత‌న విధానానికి అనుగుణంగా వాహ‌నం హైవేల‌పై ఎంత స‌మ‌యం, ఎంత దూరం ప్రయాణించింద‌నే దాని ఆధారంగా టోల్ వ‌సూలు చేస్తారు. ఫాస్టాగ్ వచ్చాక టోల్ ప్లాజాల వద్ద రద్దీ తగ్గిపోయింది. అసలు టోల్ ప్లాజాలే లేకపోతే? వాహనదారులకు ఎంతో సమయం ఆదా అవుతుంది. అదే ఉద్ధేశంతో కేంద్ర ప్రభుత్వం టోల్ ప్లాజాలను పూర్తిగా తొలగించే ప్రణాళిక దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ గతంలోనే వెల్లడించారు. టోల్ ప్లాజాలు లేకపోతే టోల్ చార్జీ ఎలా వసూలు చేస్తారంటే..నంబర్ ప్లేట్ ను రీడ్ చేసే కెమెరాలు ఉంటాయి. వాటి ఆధారంగా వాహనదారుల బ్యాంకు ఎకౌంట్ నుంచి ఛార్జీని వసూలు చేస్తారు. ఫాస్టాగ్ విధానంలో కార్లపై ఆర్ఎఫ్డీ ట్యాగ్ స్టిక్కర్ వేస్తుండడం తెలిసిందే. నంబర్ ప్లేట్లను రీడ్ చేసే విధానంలో వీటి అవసరం ఉండదు.

Read Also: Elon musk: ట్విట్టర్ డీల్ పై మనసు మార్చుకున్న మస్క్

గతంలో ఈ విషయం గురించి మంత్రి గడ్కరి మాట్లాడుతూ ‘‘కంపెనీ ఫిట్ చేసిన నంబర్ ప్లేట్లతోనే కార్లు రోడ్లపైకి రావాలని 2019లో నిబంధనలు తెచ్చాం. గత నాలుగేళ్లలో రోడ్లపైకి వచ్చిన కార్ల నంబర్ ప్లేట్లు డిఫరెంట్ ఉంటున్నాయి. కార్లకు ఈ తరహా నంబర్ ప్లేట్లు లేకపోతే నిర్ణీత సమయంలోగా వాటిని అమర్చుకునే విధంగా నిబంధనలు తేవాలి’’ అని వివరించారు. ప్రస్తుతం టోల్ ఛార్జీల్లో 97 శాతం అంటే సుమారు రూ.40,000 కోట్లు ఫాస్టాగ్ ల ద్వారా వసూలు అవుతున్నాయని..తెలిపారు మంత్రి గడ్కరి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • government
  • Minister Gadkari
  • new policy
  • Toll Gates
  • Vehicle

తాజావార్తలు

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

  • Chodavaram TDP Clash: టీడీపీ వర్సెస్ టీడీపీగా పంచాయితీ.. చోడవరంలో ఏం జరుగుతోంది?

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions