Site icon NTV Telugu

Amaravathi: అమరావతి ఔటర్‌ రింగ్‌ రోడ్‌కు కేంద్ర మంత్రి గ్రీన్‌సిగ్నల్!

Chandrababu

Chandrababu

Amaravathi: విజయవాడ ఈస్ట్రన్ బైపాస్ రోడ్‌కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అనుమతి ఇచ్చారు. చంద్రబాబు నిర్వహించిన భేటీలో అనుమతి ఇచ్చారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ చిన్ని చెప్పారు. రాజధాని ఔటర్ రింగ్ రోడ్‌కు కూడా నితిన్‌ గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించారు. యన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నిడమానూరు వరకు కూడా ఫ్లైఓవర్‌కు అనుమతి లభించినట్లు తెలిపారు. వీటన్నింటిపై తగిన ఆదేశాలు త్వరలోనే ఇస్తామని చెప్పారని ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు.

Read Also: Team India: భారత ఆటగాళ్లకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన విస్తార ఎయిర్లైన్స్.. ఏం చేసిందంటే?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతోపాటు ఆరుగురు కేంద్ర మంత్రులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కలిశారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం అంశంపై మంత్రిత్వ శాఖల వారీగా పెండింగ్ అంశాలను త్వరగా పూర్తిచేయాలని ఆయన కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహన్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, 16 ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగరియా, మనోహర్ లాల్ కట్టర్, హర్దీప్ సింగ్ పూరీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిశారు.

Exit mobile version