NTV Telugu Site icon

Election Commission Guidelines: బదిలీలు, పోస్టింగ్‌లపై ఈసీ మార్గదర్శకాలు.. ఏపీ సహా 4 రాష్ట్రాల సీఎస్‌లకు కీలక ఆదేశాలు

Ec

Ec

Election Commission Guidelines: 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్న నాలుగు రాష్ట్రాల్లో అధికారుల బదిలీలు, పోస్టులపై కొత్త ఆంక్షలు విధించింది కేంద్ర ఎన్నికల సంఘం.. ఎన్నికల అధికారుల బదిలీలు, పోస్టింగులపై మార్గదర్శకాలు జారీ చేసింది.. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కీం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులు, చీఫ్ సెక్రటరీలకు ఆదేశాలు పంపింది కేంద్ర ఎన్నికల సంఘం.. దీర్ఘకాలంగా ఒకే చోట పని చేస్తున్న అధికారులు ఎన్నికల నిర్వహణలో ఉండకూడదని ఆ మార్గదర్శకాలు స్పష్టం చేసింది. నేరుగా ఎన్నికల నిర్వహణతో సంబంధం ఉన్న ఏ అధికారి సొంత జిల్లాలో ఉండకూడదని పేర్కొంది. మూడేళ్లుగా ఒకే జిల్లాలో పని చేస్తున్న లేదా 2024 జూన్ 30 నాటికి మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకునే వారికి బదిలీలు తప్పనిసరి అని స్పష్టం చేసింది.. బదిలీలు, పోస్టింగ్ లకు సంబంధించిన నివేదికను 2024 జనవరి 31లోగా ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.

Read Also:Health Tips : రాత్రి 9 తర్వాత తింటున్నారా? అయితే ఆ వ్యాధి రావడం ఖాయం..

ఎన్నికల మార్గదర్శకాలు
* ఎన్నికలతో సంబంధం ఉన్న వారు సొంత జిల్లాలో ఉండరాదు
* దీర్ఘకాలంగా ఒకే చోట ఉన్నవారు ఎన్నికల విధుల్లో ఉండకూడదు
* మూడేళ్లుగా ఒకే జిల్లాలో ఉన్న వారిని కొనసాగించకూడదు
* 2024 జూన్ ఆఖరుకు మూడేళ్లు పూర్తయ్యే వారిని కొనసాగించొద్దు
* బదిలీలు, పోస్టింగుల వివరాలు జనవరి 31వ తేదీ లోగా ఇవ్వాలి