NTV Telugu Site icon

Telangana Formation Day: తెలంగాణలో పదేళ్ల పండగ

Telangan Formestion Day

Telangan Formestion Day

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాడి ఇవాళ్టికి పదో ఏడాదిలోకి అడుగుపెడుతున్న వేళ.. రాజకీయ పార్టీలు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు నాటి నుంచి అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఇటు పార్టీ తరఫున, అటు ప్రభుత్వం తరఫున ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతుంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు తరఫున గోల్కొండ కోటలో అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తుంది.

Also Read : Cricket: టీమిండియా యంగ్ ప్లేయర్ పై పాక్ మాజీ క్రికెట్ దిగ్గజం ప్రశంసలు..

మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ కూడా తెలంగాణను ఇచ్చింది తమ పార్టీయేనంటూ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేదిశగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుంది. వామపక్షాలతో పాటు మిగతా పార్టీలు కూడా వేడుకలకు ఏర్పాట్లు చేసుకున్నాయి. మరికొన్ని నెలల్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. ప్రజలకు దగ్గరయ్యేందుకు రాజకీయ పార్టీలన్నీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు దూకుడుగా ముందుకు వెళ్తుండటం చర్చనీయాంశంగా మారింది.

Also Read : Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

కొత్త సచివాలయం వేదికగా ఈసారి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ అవతరణ వేడుకలు చేస్తుంది. ఇవాళ (శుక్రవారం) సీఎం కేసీఆర్‌ సచివాలయంలో జాతీయజెండాను ఎగురవేసి.. గత తొమ్మిదేళ్ల ప్రగతి ప్రజలకు తెలియజేయనున్నారు. అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమాల్లో ఆయా జిల్లాల మంత్రులు, ముఖ్య ప్రజాప్రతినిధులు జాతీయ పతాకాలను ఆవిష్కరిస్తారు.

Also Read : Weight loss tips : పాస్తాను ఇలా తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు..

కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను గోల్కొండ కోటలో అధికారికంగా నిర్వహిస్తుంది. సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకల్లో గోల్కొండ కోటపై కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. మరోవైపు గవర్నర్‌ తమిళిసై రాష్ట్ర ప్రథమ పౌరురాలి హోదాలో రాజ్‌భవన్‌లో జాతీయ పతాకాన్ని ఎగురవేసి అవతరణ వేడుకల్లో పాల్గొననున్నారు. అనంతరం ప్రజలతో గవర్నర్‌ మాట్లాడుతారు. వారి సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాదర్బార్‌ నిర్వహించనున్నారు.

Also Read : BREAKING NEWS : ప్రొద్దుటూరులో ఉద్రిక్తత.. నారా లోకేష్ పై కోడి గుడ్ల దాడి..

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ బిల్లు పాస్‌ అయిన సమయంలో లోక్‌సభ స్పీకర్‌గా ఉన్న మీరాకుమార్‌ ఈ సారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాల్లో పాల్గొననున్నారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో నిర్వహించే వేడుకల్లో ఆమె పాల్గొంటారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఉత్సవాలను నిర్వహించేందుకు టీపీసీసీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీనే అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లేలా కార్యక్రమాలను రూపొందించారు.