NTV Telugu Site icon

AP Violence: ఏపీలో హింసాత్మక ఘటనలపై సీఈసీ సీరియస్‌.. సీఎస్‌, డీజీపీకి సమన్లు

Ap

Ap

AP Violence: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల తరుణంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై సీరియస్‌ అయ్యింది సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌ (సీఈసీ) ఏపీలో ఎన్నికల నిర్వహణ, పోల్ అనంతర హింసపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఈసీ.. సున్నిత ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతాయన్న సమాచారం ఉన్నా.. ఎందుకు ఈ స్థాయిలో హింస చేలరేగుతోందని మండిపడింది.. అయితే, ఏపీలో సరైన పాలనా వ్యవస్థ లేదని.. పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఈసీఐకు నివేదిక ఇచ్చారు ప్రత్యేక అబ్జర్వర్లు.. పాలనా, పోలీస్ వ్యవస్థల పని తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ నివేదికలు ఇచ్చారట ప్రత్యేక అబ్జర్వర్లు రామ్మోహన్ మిశ్రా, దీపక్ మిశ్రా..

Read Also: Chaya Singh: నటి ఇంట పనిమనిషి ఘాతుకం.. నమ్మించి ఏం చేసిందంటే?

మూడు రోజుల పాటు హింసాత్మక ఘటనలను నివారించ లేకపోవడంపై ఈసీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.. జిల్లా కలెక్టర్లకు సరైన దిశా నిర్దేశం చేయడంలో సీఎస్ జవహర్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి.. ఇక, పోలీస్ బందోబస్తు విషయంలో పూర్తి స్థాయి నిర్లక్ష్యంతో వ్యవహరించారని మాజీ డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డిపై అభియోగాలు మోపారు.. మరోవైపు.. కొత్త డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా వరుస రివ్యూలతో సరిపెడుతున్నారు.. తప్ప సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు ప్రత్యేక అబ్జర్వర్లు రామ్మోహన్ మిశ్రా, దీపక్ మిశ్రా.. ఇక, ఏపీలో హింసాత్మక ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఈసీ.. సీఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తాలకు సమన్లు జారీ చేసింది.. హింసాత్మక ఘటనలు, వాటికి అరికట్టడంలో జరిగిన వైఫల్యాలపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.. అంతేకాదు.. ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని పేర్కొంది కేంద్ర ఎన్నికల కమిషన్‌.