AP Violence: ఏపీలో హింసాత్మక ఘటనలపై సీఈసీ సీరియస్.. సీఎస్, డీజీపీకి సమన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Violence: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల తరుణంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై సీరియస్ అయ్యింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ (సీఈసీ) ఏపీలో ఎన్నికల నిర్వహణ, పోల్ అనంతర హింసపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఈసీ.. సున్నిత ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతాయన్న సమాచారం ఉన్నా.. ఎందుకు ఈ స్థాయిలో హింస చేలరేగుతోందని మండిపడింది.. అయితే, ఏపీలో సరైన పాలనా వ్యవస్థ లేదని.. పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఈసీఐకు నివేదిక ఇచ్చారు ప్రత్యేక అబ్జర్వర్లు.. పాలనా, పోలీస్ వ్యవస్థల పని తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ నివేదికలు ఇచ్చారట ప్రత్యేక అబ్జర్వర్లు రామ్మోహన్ మిశ్రా, దీపక్ మిశ్రా..
Read Also: Chaya Singh: నటి ఇంట పనిమనిషి ఘాతుకం.. నమ్మించి ఏం చేసిందంటే?
Also Read
మూడు రోజుల పాటు హింసాత్మక ఘటనలను నివారించ లేకపోవడంపై ఈసీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.. జిల్లా కలెక్టర్లకు సరైన దిశా నిర్దేశం చేయడంలో సీఎస్ జవహర్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని విమర్శలు వస్తున్నాయి.. ఇక, పోలీస్ బందోబస్తు విషయంలో పూర్తి స్థాయి నిర్లక్ష్యంతో వ్యవహరించారని మాజీ డీజీపీ రాజేంద్ర నాధ్ రెడ్డిపై అభియోగాలు మోపారు.. మరోవైపు.. కొత్త డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా వరుస రివ్యూలతో సరిపెడుతున్నారు.. తప్ప సరైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు ప్రత్యేక అబ్జర్వర్లు రామ్మోహన్ మిశ్రా, దీపక్ మిశ్రా.. ఇక, ఏపీలో హింసాత్మక ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఈసీ.. సీఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాలకు సమన్లు జారీ చేసింది.. హింసాత్మక ఘటనలు, వాటికి అరికట్టడంలో జరిగిన వైఫల్యాలపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.. అంతేకాదు.. ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని పేర్కొంది కేంద్ర ఎన్నికల కమిషన్.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!