Site icon NTV Telugu

Guntur: లేడీస్ హాస్టల్‌లో కెమెరాల కలకలం..

Camera

Camera

గుంటూరు బ్రాడీపేటలోని శ్రీనివాస లేడీస్ హాస్టల్‌లో సీసీ టీవీ కెమెరాల వ్యవహారం కలకలం రేపింది. హాస్టల్‌లోని బాత్రూం వద్ద సీసీ కెమెరాలు పెట్టారని విద్యార్థినులు అనుమానిస్తున్నారు. ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అరండల్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రాత్రి వేళల్లో హాస్టల్‌ కి బయట వ్యక్తులు వస్తున్నారని పేర్కొన్నారు. ఈ హాస్టల్ సురక్షితంగా లేదని తెలిపారు. ఈ ఘటనపై అరండల్‌పేట పోలీసులు విచారణ ప్రారంభించారు. హాస్టల్ యాజమాన్యాన్ని విచారిస్తున్నారు.

READ MORE: Punjab Kings: మాక్స్‌వెల్ స్థానంలో మిచెల్ ఓవెన్‌.. పీఎస్‌ఎల్ 2025 నుంచి నేరుగా ఐపీఎల్‌కి!

Exit mobile version