CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CCRT Workshop: హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ (CCRT) రీజినల్ సెంటర్ ఆధ్వర్యంలో “NEP 2020కు అనుగుణంగా విద్యలో తోలుబొమ్మలాట పాత్ర” అనే అంశంపై అక్టోబర్ 1 నుంచి 16వ తేదీ వరకు వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు. వర్క్‌షాప్‌లో భాగంగా CCRT రిసోర్స్ పర్సన్, విజిటింగ్ ఫ్యాకల్టీ, ప్రముఖ వెంట్రిలోక్విస్ట్, వెంట్రిలోక్విజంలో ప్రపంచ రికార్డు హోల్డర్ డా. జి.వి.ఎన్. రాజు ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్, స్వర సంస్కృతి ప్రాముఖ్యతపై శిక్షణ ఇచ్చారు. బోధనలో స్వరం, స్వర వినియోగం ఎలా ప్రభావం చూపుతాయో వివరించడంతో పాటు వెంట్రిలోక్విజం కళలో స్వరం పాత్రను ప్రదర్శన ద్వారా చూపించారు.
ఈ వర్క్‌షాప్‌లో దేశంలోని వివిధ రాష్ట్రాలు, వివిధ విభాగాలకు చెందిన మొత్తం 50 మంది పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యా బోధనలో సృజనాత్మకత, కళల వినియోగం, ఉపాధ్యాయుల కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంపొందించే దిశగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వర్క్‌షాప్‌ను CCRT ఫీల్డ్ ఆఫీసర్ సౌందర్య కౌశిక్, కోఆర్డినేటింగ్ ఆఫీసర్ చంద్రశేఖర్, ఫీల్డ్ అసిస్టెంట్ ప్రవీణ్ పర్యవేక్షిస్తూ సమన్వయం చేస్తున్నారు.
Also Read
- World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
- Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
- TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
- Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్



తాజావార్తలు
-
PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
-
PM Modi: “2047 నాటికి ‘వికసిత భారతే లక్ష్యం.. We Will Do It..” దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
-
Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
-
jailer 2 : జైలర్2 నిండా స్టార్ కాస్ట్ నింపేసిన నెల్సన్ దిలీప్ కుమార్..
-
CCRT Workshop: ఉపాధ్యాయులకు స్వర మాడ్యులేషన్పై ప్రత్యేక శిక్షణ..
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!