Rau’ IAS Study Circle : ఢిల్లీ కోచింగ్ సెంటర్ ప్రమాదం.. రావు స్టడీ సర్కిల్ యజమాని పై ఎఫ్ఐఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rau’ IAS Study Circle : ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు రావ్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ యజమాని అభిషేక్ గుప్తాపై సీబీఐ బుధవారం కేసు నమోదు చేసింది. బిల్డింగ్ బేస్మెంట్లో నీరు నిలిచిపోవడంతో యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతున్న ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై సీబీఐ విచారణ చేపట్టనుంది. ఈ కేసు దర్యాప్తును ఢిల్లీ పోలీసుల నుంచి సీబీఐ స్వీకరించింది. కోచింగ్ సెంటర్ యజమానిపై మళ్లీ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ఎఫ్ఐఆర్ నమోదైన అనంతరం సీబీఐ బృందం బుధవారం రావు ఐఏఎస్ స్టడీ సర్కిల్ భవనాన్ని సందర్శించి జూలై 27న ముగ్గురు విద్యార్థులు గల్లంతైన ప్రాంతాన్ని పరిశీలించింది.
Read Also:TDP: నేడు టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ.. మిషన్ -2029కు ప్రణాళికలు!
Also Read
అభిషేక్ గుప్తాపై నేరపూరిత నరహత్య, నిర్లక్ష్యంతో మరణం, స్వచ్ఛందంగా గాయపరచడం, నిర్లక్ష్యపు ప్రవర్తన తదితర అభియోగాల కింద కేసు నమోదు చేశారు. గత నెల జులై 27న ఢిల్లీలో భారీ వర్షాల కారణంగా ఓల్డ్ రాజేంద్ర నగర్ ప్రాంతంలోని రావు కోచింగ్ సెంటర్ భవనం బేస్మెంట్లో నీరు నిలిచిపోవడంతో సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్న ముగ్గురు విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందడం గమనార్హం. మృతుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన శ్రేయా యాదవ్ (25), తెలంగాణకు చెందిన తాన్యా సోని (25), కేరళకు చెందిన నవీన్ డాల్విన్ ఉన్నారు. గుప్తాతో పాటు ఇతర నిందితులను జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని కోరుతూ సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించవచ్చని అధికారులు తెలిపారు. విద్యార్థుల మృతితో రాజేంద్రనగర్‌లో కోచింగ్ చదువుతున్న విద్యార్థులు రెండ్రోజులుగా ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.
Read Also:Vinesh Phogat: వినేష్ ఫోగట్‌కు రివార్డు ప్రకటించిన హర్యానా ప్రభుత్వం..ఎంతంటే?
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!