Arvind Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ జాతాయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ విచారణకు హాజరయ్యారు. మూడు గంటలుగా విచారణ కొనసాగుతుంది. లిక్కర్ స్కాంపై సీఎం కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన-అమలులో జరిగిన అక్రమాలు, కమిషన్ రేట్లను పెంచడం.. సీఎంగా కేజ్రీవాల్ పాత్ర.. రూ. 100 కోట్ల ముడుపులు, విజయ్ నాయర్ సహా నిందితులతో ఉన్న సంబంధాలు, మనీష్ సిసోడియా సహా గ్రూప్ ఆప్ మినిస్టర్స్ తీసుకున్న నిర్ణయాలకి సీఎం ఆమోదం.. సౌత్ గ్రూప్ తో సంబంధాలు సహఆ ఎక్సైజ్ శాఖ అధికారులు ఇచ్చిన స్టేట్ మెంట్స్ ఆధారంగా కేజ్రీవాల్ ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
Also Read : Ravanasura: వంద కోట్ల హీరో సినిమాకి పది కోట్లు నష్టమా?
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు జారీ చేసింది.. దీంతో ఆయన ఇవాళ ఉదయం 11 గంటలకు సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. కాగా దర్యాప్తు సంస్థలపై కేజ్రీవాల్ ఆరోపణలు చేశారు. దర్యాప్తు సంస్థల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కోర్టు ముందు ఈడీ, సీబీఐలు తప్పుడు సమాచారం ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈడీ విచారణలో కొందరు పేర్లు చెప్పాలని చందన్ రెడ్డిని టార్చర్ చేశారని ఆరోపించారు. ఇప్పటి వరకు లిక్కర్ కేసులో అరెస్టయిన వాళ్లను దర్యాప్తు సంస్థలు టార్టర్ పెట్టి.. వేధిస్తున్నాయని వెల్లడించారు.
Also Read : IPL 2023: గెలిస్తే క్రెడిట్ తీసుకుని.. ఓడితే వాళ్లను నిందించడానికి ఇదేమైన టీమిండియానా..?
రూ. 100 కోట్ల రూపాయలు ముడుపులపై కేసులో ఇప్పటికే ఒక్కపైసా కూడా దొరకలేదన్నారు. సీబీఐ అధికారులు కేజ్రీవాల్ ను పలు కోణాల్లో విచారిస్తున్నారు. అయితే సీబీఐ విచారణకు ముందు మోడీకి వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్తే నమ్ముతారా.. విచారణ చేస్తారా.. అని ప్రశ్నించారు. కొత్త పాలసీ వల్ల 50 శాతం ఆదాయం పెరిగిందన్నారు. లిక్కర్ స్కాం అనేది లేదని క్లారిటీ ఇచ్చారు. కావాలని కేసులో ఇరికంచే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీని టార్గెట్ చేసి ఇలా వేదిస్తున్నారని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలోని ఒక్కొక్కరిని కేసుల్లో ఇరికిస్తున్నారని వెల్లడించారు.