NTV Telugu Site icon

JD Laxminarayana: ప్రజల వద్దకే పోలింగ్ బూత్ వచ్చేలా చేయాలి..

Jd Laxminarayana

Jd Laxminarayana

JD Laxminarayana: ప్రజాస్వామ్యంలో ఓటు హ‌క్కు విలువ‌ను వివ‌రించేందుకు విజయవాడలో జరిగిన యువ ఓటర్ చైతన్య వేదిక కార్యక్రమానికి సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తమ కాలేజీ పీఎస్సీఎంఆర్ కాలేజ్.. అందుకే ఇక్కడి నుండే ఈ పోగ్రాం మెదలుపెట్టానని జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ పేర్కొన్నారు. 5 ఏళ్ళకి ఒకసారి ఓటు వేయడం ప్రజాస్వామ్యం అనుకుంటున్నాం కానీ అది కాదు ప్రజాస్వామ్యమన్నారు. పాలిటిక్స్ చాలా మంది దూరంగా ఉంటున్నారని.. మనకి సంబంధం లేదు అనుకున్న వాటి వలెనే ఎక్కువ నష్టం కలుగుతుందన్నారు.

Also Read: Telangana Elections 2023: హైదరాబాద్‌లో భారీగా పట్టుబడ్డ నగదు.. ఆ నేతదిగా గుర్తింపు?

రాజకీయాలు ఉంటున్నాయి కానీ అందులో ప్రజలు ఉండటం లేదన్నారు. యువతరంలో ప్రజాస్వామ్యం, రాజకీయ పాత్ర గురించి తెలుసుకోవాలన్నారు. యువత చాలా మంది రాజకీయ నాయకులు అవుతామని ఎవరు చెప్పడం లేదని.. రాజకీయ పరిస్థితి అలా తయారయిందన్నారు. గ్రామాలలో కూడా ప్రజలు సొంత నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు.. ఎవరో అమలు చేసిన స్కీమ్స్‌పై ఇక్కడ నిర్ణయం ఉంటుందన్నారు. భారతదేశంలో 56శాతం ఆస్తులు 10 మంది దగ్గర ఉన్నాయన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజలు కట్టే పన్నుతో ఆధారపడి ఉన్నారని జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. భారతదేశంలో ఓటింగ్ శాతం పెరగాలన్న ఆయన.. కేవలం డబ్బున్న వాళ్లే రాజకీయంలోకి రావాలా అనేది యువత ఆలోచన చేయాలన్నారు. దేశంలో మార్పు రావాలి అంటే యువతరంతో సాధ్యం అవుతుందని.. సుమారు 70శాతం మంది యువత దేశంలో ఉన్నారన్నారు. దేశంలో ఉద్యోగ అవకాశాలు పెరిగితే డెమోక్రసి పెరుగుతుందన్నారు. రాబోయే 16ఏళ్ళు భారతదేశానికి యువత కీలకమన్నారు.

Also Read: Karumuri Nageshwara Rao: జగన్‌ సంక్షేమ పథకాలు చూసి ప్రతిపక్ష నేతలు తలదించుకోవాలి..

జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. “భారతదేశ ప్రగతికి యువత మనసులో బలంగా అనుకోవాలి. బలమైన యువత 100 మంది ఉన్నా చాలు దేశాన్ని మార్చవచ్చు అని వివేకానంద అన్నారు.డబ్బు ఉంటేనే మనం ముందుకు పోతాం అనే ఆలోచన యువత మానుకోవాలి. ఇంజినీరింగ్ విద్యార్థులం మేము.. మాకు డెమోక్రసి అవసరం లేదు అనుకోకండి. చాలా దేశాలు ఓటు హక్కు కోసం పోరాటం చేయాలిసి వచ్చింది. కానీ భారతదేశంలో ఓటు హక్కు రావడం సులభం కాబట్టి ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలి. 18 ఏళ్ళు వచ్చిన వారు అందరూ ఓటు నమోదు చేసుకోవాలి అని విజ్ఞప్తి చేస్తున్నా.. దేశంలో లాస్ట్ ఎన్నికలో 67%ఓటు పర్సెంట్ వచ్చింది ఇంకా 33%ఓటు వేయలేదు అంటే దాని ప్రభావం దేశ అభివృద్ధి మీద ప్రభావం ఉంటుంది. నాయకులు ఎన్నుకుంటే అది చేస్తా, ఇది చేస్తా అనే వాళ్లని కాదు ఇప్పటి వరకు ఏం చేసారో చూసి ఓటు వేయాలి. ఓటింగ్ శాతం పెరిగితే ఓటు బ్యాంకు రాజకీయం తగ్గుతుంది. నా ఒక్క ఓటు వలన ఏం మారుతుంది అని అనుకోవద్దు.. కావాలని ఎన్నికల ఓటింగ్ అప్పుడు టివిలలో కొత్త పోగ్రామ్స్ పెడుతున్నారు దాని వలన ఓటు వేయడానికి ఏం పోతాం లే అని యువత అనుకుంటున్నారు.. గతంలో చాలా రాష్టాలలో మావోయిస్టు వలన ఓటింగ్ శాతం తగ్గుతుంది.గన్ వలెనే ప్రజాస్వామ్యం వస్తుంది.అని ప్రజలకి పిలుపు ఇచ్చే వాళ్ళు.. మహారాష్ట్ర లో నేను వర్క్ చేసే సమయంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో ఓటింగ్ శాతం పెరిగేలా చేశాను. ప్రజలు ఏ ప్రాంతాలలో ఉంటే అక్కడ నుండే ఓటు వేసేలా ప్రతిపాదన వచ్చిన రాజకీయ నాయకులు అడ్డుకున్నారు.” అని ఆయన చెప్పారు.

Also Read: Pawan Kalyan: జనసేన, టీడీపీ సారధ్యంలో ‘గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది’.. పవన్‌ ట్వీట్

టెక్నాలజీ పెరిగింది కాబట్టి దేశంలో ఎక్కడ నుండి అయినా ఓటు వేసే విధంగా మార్పులు చేయాలి అలా చేస్తేనే ఓటింగ్ శాతం పెరుగుతుందని జేడీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. ఈవీఎం మిషన్స్ మీద అసత్య ప్రచారం జరుగుతుంది.. ఏ బటన్ నొక్కినా ఒకే పార్టీకి ఓటు పడుతుంది అని ప్రచారం వల్ల ఓటింగ్ శాతం తగ్గడానికి కారణమన్నారు. ప్రజల్లో ఈవీఎం మిషన్స్ మీద అవగాహన పెంచే విధంగా కార్యక్రమాలు చేయాలన్నారు. ప్రస్తుత రాజకీయ పార్టీలు కూడా ఓటింగ్ శాతం పెరగాలి అని అనుకోవడం లేదు దానికి కారణం తన వర్గ ఓట్ బ్యాంకు కోసమేనని ఆయన తెలిపారు. పోలింగ్ శాతం పెరిగితేనే రాజకీయ నాయకులు బాగా పని చేస్తారన్నారు. తెలంగాణ ఎన్నికల్లో రాజకీయ నాయకులు పగలు ఒక పార్టీ,రాత్రికి ఒక పార్టీకి మారుతున్నారని.. పార్టీలు మారిన అదే నాయకులు పదవులు పొందుతున్నారన్నారు. ప్రజల వద్దకే పోలింగ్ బూత్ వచ్చేలా చేయాలన్నారు. మొబైల్ ఓటింగ్ వల్ల ఓటింగ్ శాతం పెరుగుతుందన్నారు. రాజకీయ నాయకులు ఒకే వేదిక మీద చర్చలు చేసే విధంగా మార్పులు రావాలన్నారు. బడ్జెట్ పాలిటిక్స్ గురించి యువత ఆలోచన చేయాలని, డబ్బు ఉంటేనే రాజకీయం అనుకోవద్దని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.