CBI Chargesheet: భూకుంభకోణంలో ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌పై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది. పదేళ్ల క్రితం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఉద్యోగాల కుంభకోణంలో, సీబీఐ ఈరోజు ఆయనతో పాటు ఆయన భార్య రబ్రీ దేవి సహా 16 మందిపై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. వీరి కుమారుడు ప్రస్తుతం బిహార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. పాట్నాలో ఉద్యోగార్థుల కుటుంబాలకు చెందిన 1 లక్ష చదరపు అడుగుల భూమిని ఉద్యోగాల కోసం లాలూ యాదవ్ కుటుంబానికి బదలాయించినట్లు ఆరోపణలు వచ్చాయి.
Son Attack: కొడుకు కర్కశత్వం.. డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించారని తల్లిదండ్రులపై హత్యాయత్నం
రైల్వే ఉద్యోగాల కోసం వారి యజమానులకు, వారి కుటుంబాలకు బదులుగా పాట్నాలోని ప్రధాన ఆస్తులను మాజీ మంత్రి కుటుంబ సభ్యులకు విక్రయించడం లేదా బహుమతిగా ఇచ్చారని ఆరోపించారు. ప్రస్తుతం ఈ ఘటన రాజకీయాలలో తీవ్ర దుమారంగా మారింది. ఈ ఏడాది ప్రారంభంలో, ఉద్యోగాల కోసం భూ కుంభకోణానికి సంబంధించి అప్పటి రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన మాజీ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ భోలా యాదవ్‌ను సీబీఐ అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత వీరిపై చార్జిషీట్ దాఖలు చేయడం గమనార్హం.
