Cats Vs Snake Viral Video: పాములు… వీటి పేరు వింటేనే భయం పుట్టుకు రావడం ఖాయం. పామును చూస్తే పరుగులు పెట్టని వారుండరు. అలాంటి ఆ పాములతో కొన్ని రకాల జీవులు ఫైట్ చేస్తూ ఉంటాయి. ఆపద వస్తే పిల్లి కూడా పులి అవుతుంది అన్నట్లు నిజంగా ఈ వీడియోలో కొన్ని పిల్లులు పులిగా మారాయి. నాగుపాముతో బిగ్ ఫైటే చేశాయి. ఒక నెటిజన్ కొన్ని పిల్లి- పాము వీడియోలు కలిపి ఒక వీడియోను తయారుచేసి దానిని తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. కొద్ది గంటల్లోనే అది వైరల్ గా మారి లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్ లు పొందింది. అయితే ఈ వీడియో ఆద్యంతం ఆసక్తిగా ఉంది.
పిల్లి గెలుస్తుందా? పాము గెలుస్తుందా? అనే ఉత్కంఠ వీడియో చూస్తున్నంత సేపు కలుగుతుంది. సాధుజీవిలా ఉండే పిల్లి గాల్లోకి ఎగిరి ఎగిరి మరీ పాముకు పంచ్ లు ఇవ్వడం మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఒక్క కాటుతో పిల్లిని చంపేద్దాం అని వచ్చిన పాముకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా పిల్లులే ఏకదాటిగా దాడి చేయడం కూడా మనం ఈ వీడియోలో గమనించవచ్చు. వీడియోలోని ఒక బైట్ లో పిల్లి కూర్చొని ఉండగా పాము నెమ్మదిగా దాని దగ్గరకు వస్తుంది. కానీ దానిని పసిగట్టిన పిల్లి అదే ముందుగా పాముపై ఎటాక్ చేసి తరిమి తరిమి కొడుతుంది.
Also Read: Viral Wash Basin: వీళ్లేంటి ఇంత టాలెంటెడ్ గా ఉన్నారు… మంత్రిని ఆకట్టుకున్న క్రియేటివిటీ!
మరో బైట్ లో పాము తలను పిల్లి తన నోటితో కరిచి పట్టుకొని గాల్లో పల్టీలు కొడుతూ పామును చితకబాదుతుంది. మరో బైట్ లో అయితే పాము తోక ముడిచి వెళ్లిపోతుంటే కూడా పిల్లి వదలకుండా దాని తోకను పట్టుకొని లాగి మరీ పాముకు చుక్కలు చూపించింది. మొత్తానికి ఈ వీడియో చూస్తే మాత్రం సందర్భం ఏదైనా కానీ పిల్లులు తగ్గేదే లే అంటూ పాముకు చుక్కలు చూపించినట్టు అర్థం అవుతుంది.
Los reflejos de los gatos son impresionantes. 😯 pic.twitter.com/Ww7Ymx15cT
— Eugenia Dinu (@DinuEugenia) August 5, 2023