Caste Enumeration : తెలంగాణ సర్వే దేశానికే ఆదర్శం.. కోటి మైలురాయి దాటిన ఇంటింటి కుటుంబ సర్వే
- ఏడు జిల్లాల్లో నూటికి నూరు శాతం పూర్తి
- 16 రోజుల్లోనే వేగంగా పూర్తి చేసిన రికార్డు
- సర్వే విధుల్లో లక్ష మందికి పైగా ఉద్యోగులు
- కులగణనపై చిత్తశుద్ధి చాటుకున్న ప్రజా ప్రభుత్వం
- తొలి ఏడాదిలోనే సామాజిక సాధికారతకు పెద్దపీట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Caste Enumeration : అన్ని వర్గాల సంక్షేమం, సామాజిక సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే దేశంలోనే ఆదర్శంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే శుక్రవారం నాటికి మరో కీలక మైలు రాయి దాటింది. అతి తక్కువ వ్యవధిలోనే రాష్ట్రంలో కోటి కుటుంబాల గణనను పూర్తి చేసింది. సామాజిక సాధికారత లక్ష్యంగా అన్ని వర్గాలకు సమానమైన అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
నవంబర్ 6వ తేదీన మొదలైన ఈ సర్వే ద్వారా ఇప్పటివరకు 16 రోజుల్లో ఒక కోటి కుటుంబాల గణనను పూర్తి చేసింది. ఇంత తక్కువ సమయంలోనే కోటి కుటుంబాల వివరాలను సేకరించి కొత్త రికార్డు నెలకొల్పింది. దేశానికే ఆదర్శంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వే రాష్ట్రం నలుమూలాల విజయవంతంగా సాగుతోంది. ప్రజలందరూ స్వచ్ఛందంగా సర్వేలో పాలుపంచుకుంటున్నారు. మొత్తం 33 జిల్లాల్లో శుక్రవారం నాటికి దాదాపు ఎనిమిది జిల్లాల్లో సర్వే పూర్తయింది. ములుగు, జనగాం జిల్లాల్లో వందకు వంద శాతం పూర్తి కాగా నల్గొండ, మెదక్‌లో 99.9%, యాదాద్రి భువనగిరి, జగిత్యాల, గద్వాలలో 99% శాతం సర్వే పూర్తయింది. కామారెడ్డిలో 98.5%, మంచిర్యాల, అసిఫాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో 98 శాతం సర్వే జరిగింది. వేరే ప్రాంతాల్లో నివాసముంటున్న వారు, ఇండ్లకు తాళాలున్నవి.. ఇలాంటివి మినహాయిస్తే వీటన్నింటా సర్వే పూర్తయిందని అధికారులు తెలిపారు.
Also Read
- Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
- Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
- 50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
AV Ranganath : కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ సంచలన వ్యాఖ్యలు.. ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదు
మొదట్లో అనుమానాలు, అపోహలు వ్యక్తమైనప్పటికీ కుల గణనతో సామాజిక సాధికారతతో పాటు, భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలందరి అభ్యున్నతికి ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునివ్వటంతో అన్ని వర్గాల్లో సర్వేపై సానుకూలత వ్యక్తమైంది. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు.. వివిధ దశల్లో దాదాపు లక్ష మందికిపైగా ఉద్యోగులు ఈ మహా యజ్ఞంలో పాలుపంచుకోవటం విశేషం. సర్వేలో ముందుగా నవంబర్ 6వ తేదీ నుంచి 8వ తేదీ ఇళ్ల గణనను ప్రభుత్వం చేపట్టింది. సర్వేలో బాగంగా రాష్ట్రంలో మొత్తం 1,16,14,349 కుటుంబాలున్నట్లు గుర్తించింది.
నవంబర్ 9వ తేదీ నుంచి సర్వే ప్రారంభించింది. ఎన్యుమరేటర్లను ఇంటింటికీ పంపించి వివరాలను సేకరించటం ప్రారంభించింది. మొత్తం 1,16,14,349 కుటుంబాల్లో.. గ్రామీణ ప్రాంతాల్లో 64,41,183, పట్టణ ప్రాంతాల్లో 51,73,166 కుటుంబాలు ఉన్నట్లు సర్వేలో లెక్కతేలింది. ఈ సర్వే చేపట్టేందుకు మొత్తం 87,807 మంది ఎన్యుమరేటర్లు, గ్రామీణ ప్రాంతాల్లో 47,561, పట్టణ ప్రాంతాల్లో 40,246 మంది విధుల్లో ఉన్నారు. సర్వే జరుగుతున్న తీరును పరిశీలించటంతో పాటు ప్రతి పది మంది ఎన్యుమరేటర్లకు ఒక పర్యవేక్షకుడిని నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా 8788 మంది సూపరింటెండెంట్లు సర్వేలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక కోటి గృహాల సర్వే పూర్తయింది. నవంబర్ 6న ప్రారంభమైన సర్వే శుక్రవారం నవంబర్ 22 నాటికి 1,01,40,767 కుటుంబాల వివరాలను సేకరించింది. మొత్తం 87.1 శాతం సర్వే పూర్తయింది. జన సాంద్రత ఎక్కువగా ఉండటంతో గ్రేటర్ హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లో సర్వే నెమ్మదిగా సాగుతోంది. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఈ కుల గణన సర్వేను చేపట్టి తమ చిత్తశుద్ధిని చాటుకుంది. అధికారం చేపట్టిన రెండు నెలల్లోనే ఫిబ్రవరి 4వ తేదీన సీఎం నేతృత్వంలో భేటీ అయిన రాష్ట్ర మంత్రివర్గం ఇంటింటి సర్వే ద్వారా కుల గణన చేసేందుకు నిర్ణయం తీసుకుంది.
ఫిబ్రవరి 16వ తేదీన ఈ సర్వే చేపట్టేందుకు అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేసింది. సెప్టెంబర్ 12వ తేదీన ఇంటింటి సర్వే కుల గణన చేపట్టేందుకు అవసరమైన విధి విధానాలను ఖరారు చేసేందుకు ప్రభుత్వం కేబినేట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారధ్యంలో ఆరుగురు మంత్రులతో ఏర్పాటయిన సబ్ కమిటీ వివిధ దఫాలుగా సమావేశమైంది. అక్టోబర్ 9వ తేదీన మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన సిఫారసులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల గణన పేరిట సర్వే చేపట్టాలని, ప్రణాళిక విభాగాన్ని నోడల్ ఏజెన్సీగా నియమించారు. అక్టోబర్ 10వ తేదీన ప్రణాళిక విభాగం సర్వేకు సంబంధించిన పూర్తి విధి విధానాలతో జీవో నెం.18 జారీ చేసింది.
Perni Nani: ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు.. నాలుగుసార్లు సీఎంగా పనిచేసి కూడా..!
తాజావార్తలు
-
Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
-
ASUS Chromebook CX15: ఆసుస్ క్రోమ్‌బుక్ CX15 భారత్‌లో లాంచ్.. Google AI ఫీచర్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యురబిలిటీ.. చౌక ధర
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!