Site icon NTV Telugu

Caste Discrimination : విద్యార్థుల మధ్య కుల వివక్ష.. మంచి బుద్ధి చెప్పాల్సిన ఉపాధ్యాయుడే..!

Caste

Caste

Caste Discrimination : వసతి గృహాల్లో విద్యార్థులకు విద్య బుద్ధులు నేర్పవలసిన ఉపాధ్యాయులు కుల వివక్షత చూపిస్తున్నారంటూ ఒక బాలిక సెల్ఫీ వీడియో పంపించడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనం రేకెత్తిస్తుంది. తమకు ఈ పురుష ఉపాధ్యాయులు వద్దంటూ మహిళల్ని నియమించాలని కన్నీళ్ళతో వేడుకుంటుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం రామచంద్రుని పేట ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో లంబాడి సామాజిక వర్గానికి చెందిన ప్రధాన ఉపాధ్యాయుడు కులం పేరుతో తమను దూషిస్తున్నాడు అంటూ లంబాడి సామాజిక వర్గాన్ని విద్యార్థులను ప్రోత్సహిస్తూ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులను వేధిస్తున్నాడంటూ ఆ వీడియోలో బాలిక వాపోతున్నది.

Gaddar Cine Awards: ఉమ్మడి రాష్ట్రంలో కూడా చలన చిత్ర అవార్డ్స్ కు ఇంత స్పందన రాలేదు!

ప్రతి విషయంలోనూ తమను వేధిస్తున్నాడు అంటూ ఆ బాలిక మున్నీరవుతున్నది. తమతో తప్పుడు సంతకాలు చేయించుకొని వాచ్మెన్ ని తొలగించాడు అంటూ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నది. బాలికల ఆశ్రమ పాఠశాలలో పురుష ఉపాధ్యాయులను నియమించడం అత్యంత శోచనీయం. ఇకనైనా వెంటనే పురుషులను తొలగించి మహిళలని ఉపాధ్యాయులుగా నియమించాలి అని, అంతేకాకుండా లంబాడ సామాజిక వర్గానికి చెందిన ఉపాధ్యాయులు తమకు వద్దు అని, కోయ సామాజిక వర్గానికి చెందిన ఉపాధ్యాయులను నియమించాలని ఆ బాలిక ఆ వీడియోలో పేర్కొన్నది.

Bhatti Vikramarka : రాష్ట్రంలో విద్యుత్‌ అవసరాలను అధిగమిస్తాం.. గ్రీన్‌ ఎనర్జీవైపు ప్లాన్‌ చేస్తున్నాం

Exit mobile version