మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసులో ఈగల్ టీం దూకుడు పెంచింది. మూడు పబ్ యజమానులపైన కేసులు నమోదు చేసింది. పబ్బు యజమానులకు నోటీసులు జారీ చేసింది ఈగల్ టీం. మల్నాడు రెస్టారెంట్ సూర్యతో ముగ్గురు పబ్ యజమాలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించింది. మూడు పబ్ యజమాలతో కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లుగా గుర్తించింది. పబ్బుల్లో డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన యాజమాన్యాలు. వాక్ కోరా పబ్, బ్రాడ్ వే పబ్, బ్రాడ్ వే యజమానుల పైన కేసు నమోదు చేశారు పోలీసులు.
Also Read:Tirumala Rush: తిరుమల శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం.. రేపే అక్టోబర్ నెల టికెట్లు విడుదల
క్వాక్ పబ్ రాజా శేఖర, కోరా పబ్ పృద్వి వీరమాచినేని, బ్రాడ్ వే పబ్ ఓనర్ రోహిత్ మాదిశెట్టి కేసు నమోదు. ఈ ముగ్గురు పబ్బు యజమానులతో కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లు సూర్య పేర్కొన్నాడు. మరో నాలుగు పబ్ యజమానుల పాత్రపై విచారణ జరుపుతున్న ఈగల్ టీం. ప్రిజం పబ్, ఫామ్ పబ్, బర్డ్ బాక్స్ పబ్, బ్లాక్ 22 పబ్, వాక్ కోరా పబ్, బ్రాడ్ వే పబ్ పార్టీలపై విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
