NTV Telugu Site icon

Heart Attack: యువతలో పెరుగుతున్న గుండెపోటు కేసులు.. కుప్పకూలుతున్న జనాలు

Heart Attack

Heart Attack

యువతలో గుండెపోటు కేసులు అధికమవుతున్నాయి. రోజుకు ఎక్కడో చోట హార్ట్ ఎటాక్ తో బలవుతున్నారు. తాజాగా.. గుజరాత్ లోని జామ్‌నగర్‌లో 19 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థి జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. మొదటి సంవత్సరం వైద్య విద్యార్థి కిషన్ మానెక్ తన వ్యాయామ సమయంలో కుప్పకూలిపోయాడు. దీంతో.. గమనించిన జిమ్ సహచరులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ధృవీకరించారు. మానెక్ PGVCLలో డిప్యూటీ ఇంజనీర్ హేమంత్ మానెక్ కుమారుడు. కాగా.. జిమ్‌లోని సిసిటివి ఫుటేజీలో కిషన్ గుండెపోటుతో అకస్మాత్తుగా నేలపై పడిపోతున్నట్లు అందులో చూపించింది.

Jay Shah: మాట ఇచ్చిన ప్రకారం కప్ కొట్టాం.. మరో రెండు లక్ష్యాలు ఉన్నాయి!

మరోవైపు.. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇక్కడ కూడా జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా గుండె ఆగిపోయింది. గుండెపోటు రావడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సిమ్రాన్ మోటార్స్ యజమాని కవల్జీత్ సింగ్ బగ్గా ఎప్పటిలాగే వ్యాయామం చేసేందుకు తన స్నేహితులతో కలిసి జిమ్‌కు వచ్చాడు. వ్యాయామం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి కొద్దిసేపటికే మృతి చెందాడు. కవల్జీత్ సింగ్ బగ్గా మృతికి సంబంధించి అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ వీడియోలో.. కవల్‌జిత్ సింగ్ బగ్గా తన స్నేహితులతో కలిసి జిమ్‌లో వ్యాయామం చేస్తూ కనిపించాడు. వ్యాయామం చేస్తుండగా కవల్‌జిత్‌సింగ్‌కు కళ్లు తిరగడంతో కిందపడిపోయాడు. ఆ తరువాత.. కవల్జీత్ సింగ్‌కు సహాయం చేయడానికి జిమ్ సహచరులు పరుగెత్తారు. అనంతరం అతన్ని సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు.

Kolkata Mudrer Case: కోల్ కతా ఘటనలో అంతుచిక్కని తొమ్మిది ప్రశ్నలు

వ్యాయామం చేసేటప్పుడు గుండెపోటు ఎందుకు వస్తుంది..?
జిమ్‌ చేస్తున్నప్పుడు, మైదానంలో క్రీడలు ఆడేటప్పుడు.. డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆకస్మిక గుండెపోటు మరణాల సంఖ్య పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. వాస్తవానికి.. గుండె జబ్బుల కేసులు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. నేటి జీవనశైలిలో వచ్చిన మార్పుల వల్ల రక్తం గడ్డకట్టే సమస్య ఎక్కువైంది. అంతే కాకుండా.. ఒక వ్యక్తి వంశపారంపర్యంగా కూడా గుండె జబ్బులకు గురవుతాడు. ఇలాంటి క్రమంలో.. ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఎక్కువ పరుగెత్తడం లేదా కష్టపడి పనిచేయడం వల్ల జన్యుశాస్త్రం కారణంగా.. గుండెపోటుకు గురవుతాడు. అంతేకాకుండా.. ఎక్కువ వ్యాయామం, శారీరక శ్రమ చాలా ప్రమాదకరం.