Heart Attack: యువతలో పెరుగుతున్న గుండెపోటు కేసులు.. కుప్పకూలుతున్న జనాలు
- యువతలో గుండెపోటు కేసులు అధికం
- రోజుకు ఎక్కడో చోట హార్ట్ ఎటాక్ తో బలి
- జామ్‌నగర్‌లో ఓ విద్యార్థి జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో మృతి
- మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో విషాదం
- జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా హార్ట్ ఎటాక్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువతలో గుండెపోటు కేసులు అధికమవుతున్నాయి. రోజుకు ఎక్కడో చోట హార్ట్ ఎటాక్ తో బలవుతున్నారు. తాజాగా.. గుజరాత్ లోని జామ్‌నగర్‌లో 19 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థి జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. మొదటి సంవత్సరం వైద్య విద్యార్థి కిషన్ మానెక్ తన వ్యాయామ సమయంలో కుప్పకూలిపోయాడు. దీంతో.. గమనించిన జిమ్ సహచరులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ధృవీకరించారు. మానెక్ PGVCLలో డిప్యూటీ ఇంజనీర్ హేమంత్ మానెక్ కుమారుడు. కాగా.. జిమ్‌లోని సిసిటివి ఫుటేజీలో కిషన్ గుండెపోటుతో అకస్మాత్తుగా నేలపై పడిపోతున్నట్లు అందులో చూపించింది.
Jay Shah: మాట ఇచ్చిన ప్రకారం కప్ కొట్టాం.. మరో రెండు లక్ష్యాలు ఉన్నాయి!
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
మరోవైపు.. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇక్కడ కూడా జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా గుండె ఆగిపోయింది. గుండెపోటు రావడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సిమ్రాన్ మోటార్స్ యజమాని కవల్జీత్ సింగ్ బగ్గా ఎప్పటిలాగే వ్యాయామం చేసేందుకు తన స్నేహితులతో కలిసి జిమ్‌కు వచ్చాడు. వ్యాయామం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి కొద్దిసేపటికే మృతి చెందాడు. కవల్జీత్ సింగ్ బగ్గా మృతికి సంబంధించి అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ వీడియోలో.. కవల్‌జిత్ సింగ్ బగ్గా తన స్నేహితులతో కలిసి జిమ్‌లో వ్యాయామం చేస్తూ కనిపించాడు. వ్యాయామం చేస్తుండగా కవల్‌జిత్‌సింగ్‌కు కళ్లు తిరగడంతో కిందపడిపోయాడు. ఆ తరువాత.. కవల్జీత్ సింగ్‌కు సహాయం చేయడానికి జిమ్ సహచరులు పరుగెత్తారు. అనంతరం అతన్ని సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు.
एक और हँसते-चलते-नाचते मौत LIVE
महाराष्ट्र के संभाजीनगर में जिम में एरोबिक क्लास में एक व्यक्ति की हार्ट अटैक से मौत।स्वीकार करें,यह गंभीर मुद्दा है और ऐसी मौत को रोकने के लिए मेडिकल साइंस एहतियात वाले रास्ते की तलाश करे
pic.twitter.com/srpexDbWUI— Narendra Nath Mishra (@iamnarendranath) July 21, 2024
Kolkata Mudrer Case: కోల్ కతా ఘటనలో అంతుచిక్కని తొమ్మిది ప్రశ్నలు
వ్యాయామం చేసేటప్పుడు గుండెపోటు ఎందుకు వస్తుంది..?
జిమ్ చేస్తున్నప్పుడు, మైదానంలో క్రీడలు ఆడేటప్పుడు.. డ్యాన్స్ చేస్తున్నప్పుడు ఆకస్మిక గుండెపోటు మరణాల సంఖ్య పెరుగుతోందని వైద్యులు చెబుతున్నారు. వాస్తవానికి.. గుండె జబ్బుల కేసులు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. నేటి జీవనశైలిలో వచ్చిన మార్పుల వల్ల రక్తం గడ్డకట్టే సమస్య ఎక్కువైంది. అంతే కాకుండా.. ఒక వ్యక్తి వంశపారంపర్యంగా కూడా గుండె జబ్బులకు గురవుతాడు. ఇలాంటి క్రమంలో.. ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఎక్కువ పరుగెత్తడం లేదా కష్టపడి పనిచేయడం వల్ల జన్యుశాస్త్రం కారణంగా.. గుండెపోటుకు గురవుతాడు. అంతేకాకుండా.. ఎక్కువ వ్యాయామం, శారీరక శ్రమ చాలా ప్రమాదకరం.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!