NTV Telugu Site icon

MP Margani Bharat: ఎంపీ మార్గాని భరత్‌పై కేసు నమోదు

Mp Margani Bharat

Mp Margani Bharat

MP Margani Bharat: రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌పై కేసు నమోదు చేశారు దెందులూరు పోలీసులు.. దెందులూరు జాతీయ రహదారిపై ఈనెల 12వ తేదీన టూ వీలర్ వాహనాన్ని ఎంపీ భరత్ బంధువుల కారు ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో సింగవృక్షం నరసయ్య అనే వ్యక్తి మృతి చెందాడు.. అయితే, ప్రమాదానికి కారణమైన కారులో ఎంపీ మార్గాని భరత్ ఉన్నారని అనుమానిస్తున్నారు మృతుని బంధువులు.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు మృతుని కుమారుడు కిరణ్ బాబు.. దీంతో.. ఎంపీ భరత్‌పై దెందులూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Read Also: Hansika Motwani: హన్సిక అవి పెద్దగా కనిపించేందుకు ఇంజక్షన్స్ తీసుకుందా ?

కాగా, 12వ తేదీన ఎంపీ మార్గాని భరత్‌ కారు ఒక రిటైర్డు పశువైద్యుడ్ని ఢీ కొట్టింది.. దీంతో ఆ పెద్ద వయస్కుడైన రిటైర్ట్ పశువైద్యుడు నరసయ్య అక్కడికక్కడే మృతిచెందారు.. అయితే, ప్రమాదం చోటు చేసుకున్న కారులో ఎంపీ భరత్ లేరని.. ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారని చెబుతున్నారు.. ఏలూరు జిల్లా దెందులూరు మండలం సీతంపేట సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నల్లజర్ల వైపు నుంచి విజయవాడకు వెళుతున్న కారు సీతంపేట సమీపంలో టూ వీలర్ మీద రోడ్డు దాటుతున్న నరసయ్యను ఢీ కొట్టింది. దీంతో కిందపడిపోయిన ఆయన అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బ తింది. ఇక, ఇప్పుడు మృతుడి కుమారుడి ఫిర్యాదుతో ఎంపీ భరత్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.