NTV Telugu Site icon

Palla Rajeshwar Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు.. ఇలాంటి వాటికి బెదిరేది లేదన్న పల్లా

Palla

Palla

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కుటుంబంపై భూ కబ్జా కేసు నమోదయింది.. ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌లో ఏ1 గా పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఏ2 గా భార్య నీలిమా, ఏ3 మధుకర్ రెడ్డి పేర్లను చేర్చారు. కొర్రెముల్ల సర్వే నెంబర్ 796లో ప్లాట్లు కబ్జా చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 38ఈ హోల్డర్స్ పేరిట రిజిస్ట్రేషన్ చేసి కబ్జాకు ప్రయత్నం చేశారని ఫిర్యాదులో తెలిపారు. పదేళ్లుగా 200 మందిని పల్లా రాజేశ్వర్ రెడ్డి నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే 300 ప్లాట్లలో 160 ప్లాట్లు తక్కువ ధరకే కొనుగోలు చేసినట్లు తెలిపారు. రోడ్లు, పార్క్ ప్లేస్ కబ్జా చేసి ఆస్పత్రి నిర్మాణం చేపడుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. హెచ్ఎండీఏ, రెవెన్యూ, చివరికి కోర్టులను తప్పుదారి పట్టించారని పల్లాపై ఆరోపణలు వచ్చాయి.

At Home Program: రాజ్ భవన్లో ఎట్ హోం కార్యక్రమం.. హాజరైన సీఎం రేవంత్, పలువురు నేతలు

కాగా.. ఈ ఆరోపణలపై పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తనపై, తన భార్య పై అక్రమ కేసు బనాయించారని తెలిపారు. తాను కానీ, తన భార్య కానీ భూముల గురించి ఏనాడు ఎవరితో గొడవ పడలేదు.. బెదిరించలేదు.. ఆక్రమించలేదు అని అన్నారు. కేసు పెట్టేటప్పుడు సంఘటన ఎక్కడ జరిగింది.. ఎప్పుడు జరిగింది.. ఎవరు ఉన్నారు.. ఆధారాలు ఏమిటనేవి కనీస బాధ్యతగా చూడకుండా కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఒకవేళ భూమికి సంబందించిన సమస్య అయితే సివిల్ కోర్టుకు వెళ్ళాలని అన్నారు. ఎవరు ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు.. చట్టం, న్యాయం మీద నమ్మకం ఉందని.. అన్ని రకాల పోరాటం కొనసాగుతుందని పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.

Kishan Reddy: భారతీయ సంస్కృతి గొప్పతనం తెలియజేసేందుకే ఈ కార్యక్రమం..