Site icon NTV Telugu

Perni Nani: మాజీ మంత్రి పేర్నినానికి షాకిచ్చిన పోలీసులు..

Perni Nani

Perni Nani

Perni Nani: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి షాకిచ్చారు పోలీసులు.. ఆర్‌.పేట సీఐ ఏసుబాబుపై దౌర్జన్యం చేశారంటూ చిలకలపూడి పోలీసు స్టేషన్‌లో పేర్ని నానిపై కేసు నమోదు చేశారు.. అయితే, వైసీపీ నేత సుబ్బన్నను నిన్న (శుక్రవారం) విచారణకు పిలిచారు మచిలీపట్నం టౌన్‌ పోలీసులు.. ఈక్రమంలో ఆ పీఎస్‌కు వెళ్లిన పేర్ని నాని.. సీఐపై సీరియస్‌ అయ్యారు.. ఓ దశలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు.. మాజీ మంత్రి పేర్ని నానిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.. ఈ నేపథ్యంలో.. పేర్ని నానిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. పేర్ని నాని సహా 29 మందిపై కేసు నమోదు చేశారు..

Read Also: Trump Health : ట్రంప్ హెల్త్ రిపోర్ట్‌లో విస్తుపోయే విషయాలు.. వయసు పెరుగుతున్నా.. అది మాత్రం…

కాగా, మాజీ మంత్రి పేర్ని నాని నేతృత్వంలో మెడికల్‌ కళాశాల వద్ద ఇటీవల నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు వైసీపీ నేతలు.. కాలేజీలో పరీక్షలు జరుగుతున్నాయని, నిరసన తెలిపేందుకు అనుమతి లేదని పోలీసులు వారించే ప్రయత్నం చేశారు.. వారితో వాగ్వాదానికి దిగిన వైసీపీ నేతలు.. పోలీసుల లాఠీలు లాక్కున్నారు. దీంతో ఈ ఘటనలో 400 మందిపై పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు.. 41ఏ నోటీసులు ఇచ్చారు. పీఎస్‌కు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. అయితే, తాను చెప్పేవరకూ ఎవరూ పోలీసుల వద్దకు వెళ్లవద్దదు అంటూ వైసీపీ సిటీ ప్రెసిడెంట్ మేకల సుబ్బన్న సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పోలీసులు.. నిన్న సుబ్బన్నను అదుపులోకి తీసుకున్నారు. ఇక, ఈ విషయం తెలుసుకున్న పేర్ని నాని.. వైసీపీ శ్రేణులతో కలిసి మచిలీపట్నం టౌన్‌ పీఎస్‌కు వెళ్లారు.. సీఐ గదిలోకి వెళ్లి ఆయనతో వాగ్వాదానికి దిగారు.. పేర్ని నానితో పాటు వైసీపీ నేతలు కొందరు సీఐపై విరుచుకుపడ్డారు.. సీఐకి వేలు చూపిస్తూ.. వార్నింగ్‌ ఇచ్చేంత పనిచేశారు.. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు. ఇప్పుడు పేర్ని నాని సహా 29 మంది కేసు నమోదు చేశారు..

Exit mobile version