Perni Nani Wife: మాజీ మంత్రి పేర్ని నాని సతీమణిపై కేసు నమోదు!
- పేర్ని నాని సతీమణి జయసుధపై కేసు
- వేబ్రిడ్జి సరిగా పనిచేయడం లేదంటూ
- సివిల్ సప్లయిస్ అధికారులకు జయసుధ లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ మంత్రి, వైసీపీ లీడర్ పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధపై కేసు నమోదైంది. రేషన్ బియ్యం అక్రమాలపై సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ కృష్ణాజిల్లా అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. 185 టన్నుల పీడీఎఫ్ బియ్యం మాయమైనట్లు పౌరసరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డి తేల్చారు. అయితే వేబ్రిడ్జి సరిగా పనిచేయడం లేదంటూ.. తప్పించుకునేందుకు వైసీపీ నేత పేర్ని నాని యత్నించారు.
గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి పేర్ని నాని తన సతీమణి జయసుధ పేరిట బందరు మండలం పొట్లపాలెంలో గోడౌన్‌ను నిర్మించారు. దానిని సివిల్ సప్లయిస్‌కు బఫర్ గోడౌన్‌గా అద్దెకు ఇచ్చారు. గత పది రోజుల క్రితం వార్షిక తనిఖీల్లో భాగంగా పేర్ని నాని గోడౌన్‌ను సివిల్ సప్లయిస్ అధికారులు తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా స్టాక్‌లో తీవ్ర వ్యత్యాసాన్ని అధికారులు గుర్తించారు. 185 టన్నుల పీడీఎఫ్ బియ్యం మాయమైనట్టు మాయమైనట్లు తేల్చారు. పౌరసరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు పేర్ని నాని సతీమణిపై కేసు నమోదైంది.
Also Read
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
- Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
- Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్‌లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడులపై వెనక్కి తగ్గని భారత్..
పేర్ని నాని సతీమణి జయసుధతో పాటు గోడౌన్ మేనేజర్ మానస తేజపై కూడా ఫిర్యాదు నమోదైంది. వేబ్రిడ్జి సరిగ్గా పని చేయడం లేదని పేర్ని నాని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వేబ్రిడ్జి సరిగ్గా పని చేయకపోవడం వల్ల షార్టేజీ వచ్చిందని సివిల్ సప్లయిస్ అధికారులకు పేర్ని నాని సతీమణి జయసుధ లేఖ రాశారు. షార్టేజీకి సంబంధించిన ధాన్యం విలువ ప్రభుత్వానికి చెల్లిస్తామని లేఖలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Tollywood: ఫేక్ హౌస్‌ఫుల్స్… డమ్మీ కలెక్షన్స్! టాలీవుడ్లో కొత్త “మైండ్ గేమ్”!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు కేంద్రం సిద్ధం.. ఆగస్టు 17న ప్రత్యేక పార్లమెంట్ సమావేశం.?
-
Plastic Currency Notes: ఆర్బీఐ కీలక నిర్ణయం.. మార్కెట్లోకి ప్లాస్టిక్ రూ.10, రూ.20 నోట్లు..! మరి పాత నోట్ల పరిస్థితి ఏంటి..?
-
Modi-Meta: మెటాకు కేంద్రం 3 రోజులు డెడ్‌లైన్.. క్షమాపణ చెప్పకుంటే..!
-
Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా ‘పెద్ది’ దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!