Site icon NTV Telugu

Perni Nani Wife: మాజీ మంత్రి పేర్ని నాని సతీమణిపై కేసు నమోదు!

Perni Nani Wife

Perni Nani Wife

మాజీ మంత్రి, వైసీపీ లీడర్ పేర్ని నాని సతీమణి పేర్ని జయసుధపై కేసు నమోదైంది. రేషన్‌ బియ్యం అక్రమాలపై సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ కృష్ణాజిల్లా అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. 185 టన్నుల పీడీఎఫ్‌ బియ్యం మాయమైనట్లు పౌరసరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డి తేల్చారు. అయితే వేబ్రిడ్జి సరిగా పనిచేయడం లేదంటూ.. తప్పించుకునేందుకు వైసీపీ నేత పేర్ని నాని యత్నించారు.

గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి పేర్ని నాని తన సతీమణి జయసుధ పేరిట బందరు మండలం పొట్లపాలెంలో గోడౌన్‌ను నిర్మించారు. దానిని సివిల్ సప్లయిస్‌కు బఫర్ గోడౌన్‌గా అద్దెకు ఇచ్చారు. గత పది రోజుల క్రితం వార్షిక తనిఖీల్లో భాగంగా పేర్ని నాని గోడౌన్‌ను సివిల్ సప్లయిస్ అధికారులు తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా స్టాక్‌లో తీవ్ర వ్యత్యాసాన్ని అధికారులు గుర్తించారు. 185 టన్నుల పీడీఎఫ్ బియ్యం మాయమైనట్టు మాయమైనట్లు తేల్చారు. పౌరసరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు పేర్ని నాని సతీమణిపై కేసు నమోదైంది.

పేర్ని నాని సతీమణి జయసుధతో పాటు గోడౌన్ మేనేజర్ మానస తేజపై కూడా ఫిర్యాదు నమోదైంది. వేబ్రిడ్జి సరిగ్గా పని చేయడం లేదని పేర్ని నాని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వేబ్రిడ్జి సరిగ్గా పని చేయకపోవడం వల్ల షార్టేజీ వచ్చిందని సివిల్ సప్లయిస్ అధికారులకు పేర్ని నాని సతీమణి జయసుధ లేఖ రాశారు. షార్టేజీకి సంబంధించిన ధాన్యం విలువ ప్రభుత్వానికి చెల్లిస్తామని లేఖలో పేర్కొన్నారు.

Exit mobile version