Site icon NTV Telugu

INS Vikrant: కీలక మైలురాయిని దాటిన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్

Ins Vikrant

Ins Vikrant

INS Vikrant: భారత్‌కు చెందిన మొట్టమొదటి విమాన వాహక నౌక ఓ చారిత్రక మైలురాయిని దాటింది. ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌పై తొలిసారి ఓ నౌకాదళ స్వదేశీ యుద్ధ విమానం ల్యాండ్‌ అయింది. ఎల్‌సీఏ తేజస్ (నేవీ) విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై తొలిసారిగా విజయవంతంగా ల్యాండ్ అయింది. సముద్ర ట్రయల్స్‌లో భాగంగా ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై భారత్‌కు చెందిన స్వదేశీ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (LCA) తేజస్ వెర్షన్ విజయవంతంగా ల్యాండ్ అయింది. ఓ ఫిక్స్‌డ్ వింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఈ నౌకపై ల్యాండ్‌ కావడం కూడా ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

Turkey Earthquake: టర్కీ-సిరియా భూకంపం.. ముందే హెచ్చరించిన డచ్ పరిశోధకుడు

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌పై తేలికపాటి యుద్ధ విమానాన్ని ల్యాండింగ్ చేయడం ద్వారా నావికాదళ పైలట్లు, భారతీయ నావికాదళం ఆత్మ నిర్భర్ భారత్ దిశగా ఒక చారిత్రక మైలురాయి సాధించింది. ఇది స్వదేశీ విమానాల రూపకల్పన, అభివృద్ధి, నిర్మాణం, నిర్వహణలో భారతదేశ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుందని భారత నౌకాదళం ఒక ప్రకటనలో తెలిపింది. స్వదేశీ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ తేజస్ (నేవీ) విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ నుంచి బయలుదేరింది. రూ.20,000 కోట్ల వ్యయంతో నిర్మించిన 45,000 టన్నుల ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ను గతేడాది సెప్టెంబర్‌లో ప్రారంభించారు. 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పుతో, ఐఎన్‌ఎస్ విక్రాంత్ భారతదేశంలో నిర్మించిన అతిపెద్ద యుద్ధనౌక. మిగ్‌-29కే, హెలికాప్టర్‌లతో సహా 30 యుద్ధ విమానాలను ఇది మోసుకెళ్లగలదు. ప్రస్తుతం ఈ యుద్ధనౌకపై ఏవియేషన్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నారు.

Exit mobile version