Site icon NTV Telugu

Car Driver: 10 కోట్ల విలువైన బంగారంతో ఉడాయించిన కారు డ్రైవర్!

Gold Price Today

Gold Price Today

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో రూ.10 కోట్ల విలువైన బంగారంతో ఓ కారు డ్రైవర్ ఉడాయించాడు. నగల వ్యాపారి రోడ్డు పక్కన టీ తాగుతుండగా.. ఇదే అదనుగా భావించిన డ్రైవర్ ఒక్కసారిగా పరారయ్యాడు. కారును నందిగామ దగ్గర మునగచెర్ల వద్ద వదిలిన డ్రైవర్.. బంగారంతో పరారయ్యాడు. వ్యాపారి జగ్గయ్యపేట మండలం చిలకలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. ప్రత్యేక బృందాలు డ్రైవర్ కోసం గాలిస్తున్నాయి.

వివరాల ప్రకారం… హైదరాబాద్ బీఎన్‌ఆర్ జ్యుయలరీ నుంచి విజయవాడ డెలివరీకి వ్యాపారి కిషన్ లాల్ సహా ముగ్గురు వ్యక్తులు బయల్దేదారు. జగ్గయ్యపేట ఆటోనగర్ సమీపంలోని హోటల్ వద్ద టీ తాగేందుకు డ్రైవరు జితేష్ కారు ఆపాడు. వ్యాపారి కిషన్ లాల్ సహా మరో వ్యక్తి టీ తాగుతుండగా.. డ్రైవరు జితేష్ ఇదే అదనుగా భావించాడు. కారులో ఉన్న బంగారంతో పరారయ్యాడు. ఇది చూసిన వ్యాపారి గట్టిగా కేకలు వేశాడు. వెంటనే జగ్గయ్యపేట మండలం చిలకలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

డ్రైవర్ జితేష్ కారును నందిగామలోని మునగచెర్ల వద్ద వదిలి.. బంగారంతో పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆరు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. కారులో 7 కిలోల బంగారం ఉన్నట్లు వ్యాపారి కిషన్ లాల్ పోలీసులకు తెలిపాడు. బంగారం విలువ దాదాపు రూ.10 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.

Exit mobile version