NTV Telugu Site icon

Capsicum Price: టమాటా కంటే క్యాప్సికమ్కు ధర ఎక్కువ..! ఎక్కడంటే

Capsikam

Capsikam

దేశ వ్యాప్తంగా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. పుట్టగొడుగులు, బెండకాయలు, బంగాళదుంపలు, ఉల్లి, కాకరకాయ, పర్వాల్, పొట్లకాయ సహా అన్ని కూరగాయల ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. కిలో రూ.30 నుంచి 40 వరకు లభించే కూరగాయలు ఇప్పుడు కిలో రూ.60 నుంచి 100కు అమ్ముడవుతున్నాయి. మరీ ముఖ్యంగా టమాటా, కొత్తిమీర ధరలు అత్యధికంగా ఉన్నాయి. గత నెల రోజులుగా కొత్తిమీర, టమాటా ధరల్లో అధికంగా ఉన్నాయి.

Infinix 26GB RAM Phone: 26GB RAM స్టోరేజ్ తో కొత్త స్మార్ట్ లాంచ్..ధర?

మే, జూన్ మధ్యకాలంలో కిలో రూ.20 నుంచి 30 వరకు పలికిన టమాటా.. ఇప్పుడు కిలో రూ.250 నుంచి 300 వరకు విక్రయిస్తున్నారు. అదేవిధంగా కిలో రూ.40 నుంచి 60 వరకు విక్రయించే కొత్తిమీర కూడా ఖరీదుగా మారింది. ఇప్పుడు కిలో కొత్తిమీర కొనాలంటే రూ.200 లేదా అంతకంటే ఎక్కువ డబ్బులు పెట్టాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఈ కూరగాయల సరసన మరోకటి వచ్చి చేరింది. ఏమిటీ అని అనుకుంటున్నారా.. ఆ కూరగాయ పేరు క్యాప్సికమ్. అది కూడా డబుల్ సెంచరీ కొట్టినట్లు వార్తలు వస్తున్నాయి. క్యాప్సికం ధర కిలో రూ.200కి చేరింది. పంజాబ్‌లోని మోగా జిల్లాలో క్యాప్సికం అధిక ధర పలుకుతుంది. అక్కడ టొమాటో కంటే క్యాప్సికమ్ ఖరీదు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

Gyanvapi Case: జ్ఞాన్‌వాపి మసీదు కార్బన్‌ డేటింగ్‌కు వారణాసి కోర్టు అనుమతి

మరోవైపు అక్కడ క్యాప్సికం కిలో రూ.200కు విక్రయిస్తుండగా.. కిలో టమాటా రూ.100 నుంచి రూ.150 వరకు పలుకుతోంది. అంతేకాకుండా రానున్న రోజుల్లో కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. అక్కడ కిలో వంకాయ రూ.80కి విక్రయిస్తున్నారు. శనగలు కిలో రూ.100, కొన్ని చోట్ల రూ.120 చొప్పున విక్రయిస్తున్నారు. పంజామ్ లోని మోగాలో బెండకాయ, కాకరకాయ తక్కువ ధరలకు లభిస్తాయి. ఇక్కడ కిలో బెండకాయ ధర 60 రూపాయలు, కాకరకాయ 50 రూపాయలకు విక్రయిస్తున్నారు.