NTV Telugu Site icon

Cantonment: కేంద్రం సంచలన నిర్ణయం.. కంటోన్మెంట్ ఏరియా మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోకి

Contonment

Contonment

కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు సంచలన నిర్ణయానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కంటోన్మెంట్ ప్రజలకు శుభవార్త చెప్పింది కేంద్రం. కళ్లు కాయలు కాచేలా ఎదురు చూసిన కల నెరవేరింది. కంటోన్మెంట్ ఏరియాలో సామాన్య ప్రజలు నివసించే ప్రాంతాలను మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విలీనం చేయడానికి కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈనెల 27న ఢిల్లీలో జరిగిన సమావేశంలో కమిటీ నిర్ణయం తీసుకోవడం 28న దీనికి సంబంధించిన ఆదేశాలు వెలువడటం జరిగింది. అయితే… దీంతో ఇకపై కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాలు జీహెచ్ఎంసీ లోకి రావడంతో పాటుగా వాటి అభివృద్ధి పనులు కూడా ఇకపై జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో జరగనున్నాయి.

 

ఢిల్లీలో జరిగిన కమిటీ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం తరఫునుంచి సీఎస్ శాంతి కుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ ధన కిషోర్ లు పాల్గొన్నారు. అయితే.. ఇప్పటివరకు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న అన్ని రకాల ఆస్తులను జీహెచ్ఎంసికి స్వాధీనం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. అదేవిధంగా ఉన్న అప్పులను కూడా తీర్చే బాధ్యత జీహెచ్ఎంసి యే తీసుకోనుంది. లీజుకిచ్చినవి ఓల్డ్ గ్రాంట్ భవనాల పర్యవేక్షణ ఇక సైతం జీహెచ్ఎంసిదే. బోర్డు పరిధిలో ఉన్న అన్ని రకాల ఆస్తులను ఉచితంగానే రాష్ట్ర ప్రభుత్వానికి రక్షణ శాఖ అప్పగించనుంది. దీంతో అత్యంత విలువైన ఆస్తులు భూములు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి రానున్నాయి.