Urvashi Rautela : డిస్నీ విలన్ గా మారిన ఊర్వశి రౌతేలా.. ఐశ్వర్యను కాపీ కొట్టిందంటూ ట్రోలింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Urvashi Rautela : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. వరుసగా పలువురు భారతీయ కథానాయికలు రెడ్ కార్పెట్ ఈవెంట్లో సందడి చేస్తున్నారు. ఇప్పుడు ఊర్వశి రౌతేలా వంతు. ఈ మాజీ మిస్సు చాలా కాలంగా బాలీవుడ్ సహా సౌత్ పరిశ్రమల్లో ఓ వెలుగు వెలగాలని కలలు కంటోంది. నెమ్మదిగా ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళుతోంది. ఊర్వశి రౌతే కూడా ఇందులో పాల్గొంది. ఈసారి ఆమె పూర్తిగా భిన్నమైన అవతారంలో కనిపించింది. కేన్స్ ఉత్సవాల్లో ఊర్వశి అప్పియరెన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఊర్వశి రౌటేలా ఎలిగేటర్ నెక్ పీస్ కేన్స్ 2023లో హెడ్ టర్నర్ గా నిలిచింది. ఇలాంటి విభిన్నమైన ఆలోచన ఫ్యాషన్ సెన్స్ పరంగా సృష్టి చాలా మందిని ఆశ్చర్యపరిచింది. పింక్ టల్లే గౌనుతో పాటు ఎలిగేటర్ స్టేట్ మెంట్ జ్యువెలరీని ధరించి కనిపించింది. ఆమె గౌనును సిమా కోచర్ డిజైన్ చేయగా.. నెక్లెస్ ను కార్టియర్ డిజైన్ చేశారు.
Read Also:Viral Video: చేపలైనా మగాళ్లైనా మీకు పడాల్సిందే.. ఉక్కిరి బిక్కిరి కావాల్సిందే
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
ఊర్వశి రౌతేలా ప్రస్తుతం కేన్స్ పండుగ మూడవ రోజు బ్లూ లిప్ స్టిక్ ధరించి కనిపించింది. దీంతో ఈ లుక్ చూసి నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మూడో రోజు తన గ్లామ్ లుక్‌ను సూచించడానికి ఊర్వశి రౌతేలా రెడ్ కార్పెట్ పై నడిచేటప్పుడు ఆమె లుక్ చర్చనీయాంశంగా మారింది. ఆ సయమంలో ఊర్వశి బ్లూ అండ్ వైట్ ఆఫ్ షోల్డర్ ప్రిన్సెస్ గౌను ఎంచుకుంది. ఈ గౌనులో ఆమె అద్భుతమైన పోజులు కూడా ఇచ్చింది. కానీ ఆమె ధరించిన దుస్తుల కంటే బ్లూ లిప్‌స్టిక్ అందరి దృష్టిని ఆకర్షించింది.
Read Also:Imran Khan: రెండు కేసుల్లో ఇమ్రాన్‌ఖాన్‌కు బెయిల్ మంజూరు
కేన్స్‌లో ఊర్వశి రౌతేలా తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రాలను చూసిన తర్వాత నెటిజన్ల నుంచి భారీ స్పందన వచ్చింది. ఊర్వశి రౌతే డిస్నీ విలన్‌గా కనిపిస్తుందని కొందరు అంటున్నారు. అందుకే ఇలా లిప్ స్టిక్ వేసుకుని ఐశ్వర్యరాయ్ లుక్ ని కాపీ కొట్టే ప్రయత్నం చేస్తోందని కొందరు అంటున్నారు. ఊర్వశి ఫ్రెంచ్ రివేరా-కేన్స్ ఉత్సవాల్లో పర్వీన్ బాబీ బయోపిక్ ను ప్రదర్శించనున్నట్లు కథనాలొచ్చాయి. ఊర్వశి ఫోటోకాల్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొననుంది. అక్కడ ఫర్వీన్ బాబి బయోపిక్ ని ప్రదర్శించనుంది. ఇది ఈ ఏడాది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం. విడుదలకు ముందు ప్రచారం పరంగా హైప్ తెచ్చేందుకు టీమ్ శ్రమిస్తోంది.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!