NTV Telugu Site icon

Telangana Assembly Elections 2023: ఉత్కంఠరేపుతోన్న ఎగ్జిట్‌ పోల్స్‌.. ఓట్లపై ఆరా తీస్తున్న అభ్యర్థులు..!

Voting

Voting

Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్ని్కల్లో పోలింగ్‌ ముగిసింది.. సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ ముగియగా.. క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కలిపిస్తున్నారు అధికారులు.. అయితే, ఎగ్జిట్‌ పోల్స్‌ కొందరు అభ్యర్థుల్లో ఉత్సాహాన్ని నింపుతుంటే.. మరికొందరని టెన్షన్‌ పెంచుతున్నాయి.. ఇప్పటి వరకు వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌ చూస్తే.. కాంగ్రెస్‌కు పట్టం కట్టబోతున్నారు ఓటర్లు.. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ 62-72, బీఆర్‌ఎస్‌ 35-46, బిజెపి 3-8, ఎంఐఎం 6-7, ఇతరులు 1-2 స్థానాలు గెలుపొందే అవకాశాలు ఉన్నాయని.. కాంగ్రెస్‌ పార్టీ 42.7, బీఆర్‌ఎస్‌ 37.8, బీజేపీ 13.2, ఎంఐఎం 2.5 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉందని పీపుల్స్‌పల్స్‌ – సౌత్‌ఫస్ట్‌ సర్వే పేర్కొంది.. కాంగ్రెస్‌ 4.9 శాతం ఓట్లు అధికార బీఆర్‌ఎస్‌ పార్టీపై ఆధిక్యం సాధించే అవకాశాలున్నాయని అంచనా వేసింది.. దీంతో.. లెక్కలు తేల్చుకునే పనిలో పడిపోయారు ఆయా పార్టీల అభ్యర్థులు..

Read Also: Nayanthara: నయనతారకు ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చిన భర్త.. ధర ఎంతో తెలుసా?

తన నియోజకవర్గం పరిధిలోని పోలింగ్‌ బూత్‌ల్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి..? ఏ పోలింగ్‌ బూత్‌లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి..? అందులో మనకు అనుకూలంగా ఎన్ని పడ్డాయి? లాంటి విషయాలపై ఆరా తీస్తున్నారు.. గ్రామస్థాయి లీడర్లు, బూత్‌స్థాయి లీడర్లకు ఫోన్లు చేసి.. ఆ వివరాలను తెప్పించుకుంటున్నారట.. ఎగ్జిట్‌ పోల్స్‌ ఉత్కంఠ రేపుతుండగా..? డిసెంబర్‌ 3వ తేదీన ఫలితాలు వచ్చే వరకు వేచిచూసే పరిస్థితి లేకుండా చేస్తుందట.. దీంతో.. బూత్‌స్థాయి నుంచి వివరాలు తెప్పించుకుని.. తమకు వచ్చే ఓట్లు..! గెలిస్తే మెజార్టీ ఎంత వస్తుంది..? ఓడితే ఎన్ని ఓట్లతో పరాజయం పాలయ్యే అవకాశం ఉంది? లాంటి లెక్కలు కట్టడంలో అభ్యర్థులు, వారి అనుచరులు తలమునకలు అవుతున్నారట.. 28వ తేదీ వరకు ప్రచారం.. ఆ తర్వాత ప్రలోభాల పర్వంలో మునిగిపోయిన నేతలు.. ఇప్పుడు గణాంకాలు తీసేపనిలో బిజీ అయిపోయారట.. డిసెంబర్‌ 3వ తేదీన ఎలాంటి ఫలితం రాబోతోంది? అనే విషయాన్ని ముందే తేల్చే విధంగా అంచనాల్లో మునిగిపోయారట.