Munugode bypoll: మునుగోడు ఉప ఎన్నికకు నామినేషన్ల ఘట్టం ముగిసింది. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేశారు. సాధారణంగా ఎన్నికలంటేనే ఆడంబరాలను ప్రదర్శిస్తుంటారు అభ్యర్థులు. అందులో నామినేషన్లకు కూడా మంది మార్బలంతో వస్తుంటారు. కొన్ని చోట్ల భారీ ర్యాలీతో నామినేషన్లు వేస్తుంటారు. ప్రస్తుతం తెలంగాణలో మునుగోడు ఉపఎన్నికలను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో మునుగోడు బైపోల్లో ప్రజలను ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున్న జనసమీకరణ చేసి ఆర్భాటంగా నామినేషన్లు దాఖలు చేశారు.
Read Also: Palle Ravikumar : కాంగ్రెస్‌కు షాక్.. టీఆర్‌ఎస్‌లోకి పల్లె రవి దంపతులు
ఇదిలా ఉండగా.. నామినేషన్ల దాఖలులో ఓ అభ్యర్థి ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. నియోజకవర్గంలోని నాంపల్లి మండలం కుమ్మరిగూడెంకు చెందిన వీరభోగ వసంతరాయలు గుర్రంపై వచ్చి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. వృత్తిరీత్యా వైద్యుడైన వసంతరాయుడు.. హైదరాబాద్ పరిధిలోని ఎల్‌బీనగర్‌లో హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. ఇలా వినూత్నంగా గుర్రంపై వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. అది చూసిన స్థానికులు భలేగా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. కొందరు ఫొటోలు తీసి స్థానిక వాట్సాప్ గ్రూపులలో, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది.
Read Also: Spanish Paper: దుమారం రేపుతున్న భారత ఆర్థిక వ్యవస్థపై స్పానిష్ పేపర్ కథనం
నియోజకవర్గంలో బీసీ ఓట్లు అధికంగా ఉన్నప్పటికీ ప్రధాన పార్టీలు బీసీలకు టికెట్లు కేటాయించకపోటం బాధాకరమని వసంతరాయుడు అన్నారు. బీసీలను ప్రభుత్వం గుర్తించాలన్న ఉద్దేశ్యంతోనే గుర్రంపై వచ్చి నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే.. మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్ చెప్పటం విడ్డూరంగా ఉందని ఆయన వ్యాఖ్యనించారు. మంత్రిగా రాష్ట్రం మొత్తాన్ని కేటీఆర్ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉప ఎన్నికలు ఉన్నచోట్లే అభివృద్ధి చేస్తామని చెప్పటం దారుణమన్నారు.