Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home International News Canada Immigration Bill C12 Impact On Indians Asylum Rules

Canada Bill C-12: ఇండియన్స్ టార్గెట్‌గా కెనడా కొత్త రూల్స్? ఇక అంతే సంగతులు!

Published Date :April 21, 2026 , 4:21 pm
By Shiva Ganesh
Canada Bill C-12: ఇండియన్స్ టార్గెట్‌గా కెనడా కొత్త రూల్స్? ఇక అంతే సంగతులు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Canada Bill C-12: కెనడా ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో పెను మార్పులు వచ్చాయి. అక్కడి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ‘బిల్ సి-12’ (Bill C-12) చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం వల్ల కెనడాలో స్థిరపడాలని చూస్తున్న వారికి, ముఖ్యంగా రిఫ్యూజీ (శరణార్థి) హోదా కోరుకునే భారతీయులకు భారీ షాక్ తగిలింది. ఈ కొత్త చట్టం వివరాలు, ఇండియన్స్‌పై దాని ప్రభావం ఎంత మేరకు ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Mega El Nino: 149 ఏళ్ల తర్వాత ‘‘మెగా ఎల్ నినో’’.. భారత్‌లో కరువు తప్పదా..?

బిల్ సి-12 ముఖ్యమైన నిబంధనలు ఇవే..
కొత్త నిబంధన ప్రకారం.. కెనడాలోకి ప్రవేశించిన ఒక ఏడాది లోపు మాత్రమే రిఫ్యూజీ హోదా కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆ గడువు దాటితే దరఖాస్తును స్వీకరించరు. ఇదివరకైతే చాలా ఏళ్లు గడిచాక, పీఆర్ (PR) రాకపోతే చివరి ఆప్షన్‌గా భారతీయులు రిఫ్యూజీ క్లెయిమ్ చేసేవారు. ఇకపై అది సాధ్యం కాదు. ఈ చట్టం కేవలం కొత్తవారికి మాత్రమే కాదు, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న సుమారు 19,000 దరఖాస్తులపై కూడా ప్రభావం చూపనుంది. దీనివల్ల వేల సంఖ్యలో భారతీయ దరఖాస్తుదారులు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది.

కెనడా ప్రభుత్వం ఇప్పుడు ఏ ఒక్క వ్యక్తినో కాకుండా, ఒకేసారి పెద్ద సంఖ్యలో వీసాలను లేదా ఇమ్మిగ్రేషన్ పత్రాలను రద్దు చేసే అధికారాన్ని పొందింది. దీని కోసం ప్రతి కేసును విడివిడిగా విచారించాల్సిన అవసరం లేదు. “జాతీయ ప్రయోజనాల” దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది. శరణార్థుల దరఖాస్తుల విచారణను వేగవంతం చేయడం, ఇతర దేశాలతో సమాచారాన్ని పంచుకోవడం ఈ చట్టంతో సులభతరం అవుతుంది. అయితే మానవ హక్కుల సంఘాలు, ఇమ్మిగ్రేషన్ లాయర్లు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు దీనిని శరణార్థుల హక్కుల ఉల్లంఘనగా పేర్కొంటున్నాయి. సరైన విచారణ లేకుండానే వీసాలు రద్దు చేయడం వల్ల విదేశీయులను బలవంతంగా వెనక్కి పంపే ముప్పు పెరుగుతుందని వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సమయంలో కెనడా ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడానికి ఇది అవసరమని ప్రభుత్వం చెబుతోంది. మోసపూరిత దరఖాస్తులను అడ్డుకోవడమే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది. దరఖాస్తు తిరస్కరణకు గురైన వారికి PRRA (Pre-Removal Risk Assessment) అనే అవకాశం ఉంటుందని, ఆ వ్యక్తిని సొంత దేశానికి పంపడం సురక్షితమేనా అని అంచనా వేస్తామని వెల్లడించింది.

భారతీయులపై ప్రభావం ఎంతంటే..
కెనడాలో భారతీయ విద్యార్థులు, వర్క్ పర్మిట్ హోల్డర్లు లక్షల్లో ఉన్నారు. పీఆర్ దక్కని వారు చాలామంది రిఫ్యూజీ దరఖాస్తుల మీద ఆధారపడుతుంటారు. కొత్త చట్టం వల్ల పాత కేసులు రీ-ఓపెన్ అవ్వడం లేదా వేగంగా తిరస్కరణకు గురవ్వడం జరిగితే.. భారతీయులు పెద్ద సంఖ్యలో డిపోర్టేషన్ (దేశం నుంచి బహిష్కరణ) ఎదుర్కోవాల్సి రావచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కెనడా వెళ్లాలనుకునే వారు లేదా అక్కడ ఉన్న వారు ఇకపై ఇమ్మిగ్రేషన్ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

READ ALSO: Pahalgam Attack: పహల్గామ్ గాయానికి ఏడాది.. ఇప్పుడు ‘మినీ స్విట్జర్లాండ్’ పరిస్థితి ఎలా ఉందంటే!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Canada Bill C-12 India
  • Canada Immigration Rules 2026
  • Canada Refugee Claim 1 year limit
  • Indian Students Deportation Canada
  • Justin Trudeau Immigration Reform

తాజావార్తలు

  • Canada Bill C-12: ఇండియన్స్ టార్గెట్‌గా కెనడా కొత్త రూల్స్? ఇక అంతే సంగతులు!

  • Mega El Nino: 149 ఏళ్ల తర్వాత ‘‘మెగా ఎల్ నినో’’.. భారత్‌లో కరువు తప్పదా..?

  • India’s E85 Fuel Revolution: భారత్‌లో ఇంధన విప్లవం.. ఇక పెట్రోల్ కాదు, ఆల్కహాల్‌తో వాహనాల పరుగులు!

  • Allu Arjun : ‘ముంబై’లో బన్నీ సెటిల్మెంట్ వెనుక అసలు నిజమిదే

  • Mallikarjun Kharge: ప్రధాని నరేంద్రమోడీ ఒక టెర్రరిస్ట్.. కాంగ్రెస్ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్‌ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!

  • రూ.11 వేలలోపే పవర్‌ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!

  • AMOLED డిస్‌ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!

  • Novak Djokovic: కోహ్లీ వల్లే నేను క్రికెట్ ను ఆస్వాదిస్తున్నా.. త్వరలోనే భారత్‌కు వస్తాను.!

  • 200% వాల్యూమ్ బూస్ట్, 144Hz స్క్రీన్ + 7000mAh బ్యాటరీ.. బడ్జెట్‌లోనే POCO M8s 5G లాంచ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions